లోకేషన్నా… వదిలేయి, దండం పెడతా: శ్రీరెడ్డి లెటర్ ఇదే

లోకేష్ అన్నా నా ఫామిలీ మీద ఒట్టేసి... చెప్తున్నా ఇప్పటి పరిస్థితుల నుంచి జారుకోవటానికి ఈ letter అనుకోకండి.. కానీ కాదు... అది వారం రోజులు... ఆహారం, నిద్ర లేకుండా కామెంట్స్ చదివి, ఎంత మనోవ్యధకి గురై తీసుకున్న నిర్ణయం.

Post Published By: Vencateshg
Updated : 14 November 2024, 12:43 PM IST

లోకేష్ అన్నా నా ఫామిలీ మీద ఒట్టేసి... చెప్తున్నా ఇప్పటి పరిస్థితుల నుంచి జారుకోవటానికి ఈ letter అనుకోకండి.. కానీ కాదు... అది వారం రోజులు... ఆహారం, నిద్ర లేకుండా కామెంట్స్ చదివి, ఎంత మనోవ్యధకి గురై తీసుకున్న నిర్ణయం. నేను ఒక విషయం అంటే దయచేసి నొచ్చుకుండి, Incase futured ysrcp వచ్చినా తిరిగి నా బుద్ధి వక్రం అవుతుందని అనుకోకండి. అలా చేస్తే private వ్యక్తులతో నన్ను ఏమైనా చేయించుకోవచ్చు.. ఇకపై Filthy Language ఎవరి మీద వాడనని మా కులదైవం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నా దాకా వచ్చేసరికి నేను చేసిన తప్పు ఏంటని అర్ధమైంది ఎంత బాధ ఉంటుందో అని.

ఇప్పటికి నేను, నా కుటుంబం అనుభవించిన క్షోభ, 1000 సంవత్సరాలకు సరిపడా అనుభవించాం.. ఇంట్లో పెళ్ళికావలసిన పిల్లలు ఉన్నారు.. నన్ను కొడితే ఒక నెల లేదా 3 నెలలకు గాయాలు మానవచ్చు .. కాని నా వల్ల ముగ్గురికి జీవితాంతం శిక్ష వేసినదాన్ని అవుతాను.. నా బాధ నాకంటే బాగా ఇంతమందిని పరిపాలించే మీకు అర్ధమయ్యే ఉంటుంది... please అన్నా save my family. మీడియాలో సోషల్ మీడియాలో కేసుల నుంచి బంధ విముక్తిరాలిని చేయండి. ఇంకా ఎవరికైనా sorry చెప్పటం మరిచిపోతే, వారికి కూడా పేరు పేరునా క్షమాపణలు అడుగుతున్న.. సినిమా రంగంలో ఉన్న వారికి చిరంజీవి, నాగబాబుగార్లు, అందరికీ కూడా నా క్షమాపణలు...

షర్మిలక్క, సునీతక్క క్షమించండి. మీరు కూడా..

ముందుగా లోకేష్ అన్నకి విజ్ఞప్తి :- లోకేష్ అన్న, నేను పుట్టింది గోదావరి, అయినా, పెరిగింది మొత్తం విజయవాడ పరిసర ప్రాంతాల్లో. అందుకే నాకు మీ సామాజిక వర్గం వాళ్ళే వారే 95% పర్సెంట్ ఫ్రెండ్స్.. ఈ విషయాన్ని అనేక వీడియోస్ లో కూడా చెప్పాడు. చాలా తక్కువ సందర్భాల్లో ఈ విషయాలను నేను చెప్పాను. కాని అవమానించలేదు. అమ్మ నాన్నగారు కూడా విజయవాడలోనే ఎక్కువ అనుబంధం అలాగే మా సొంత ఇల్లూ గట్ర అక్కడే .. అమరావతి రావడం మా ఇంట్లో వాళ్ళని ఎంత సంతోషపెట్టింది. ఎందుకంటే వాళ్ళకున్న అర కోశ సొంత ఇల్లు రేట్లు పెరిగాయని.. అందుకే మా అమ్మనాన్నలు తెలుగుదేశం పార్టీకి ఓటు వేసారు.

మీరు కొన్నివిషయాలలో ఎంచి మొండిగా ఉంటారో అంత కంటే ఎక్కువ, మంచితనం కూడా ఉందని ఈ నా కేసుల విషయంలో మాట్లాడమని నేను అంతకుముందు videos Mention చేసినట్టు sorry చెప్పించింది కూడా మా కుటుంబసభ్యులే. అలాగే మా కుటుంబసభ్యులు మీతో డైరెక్ట్ గా మాట్లాడమని చెప్పారు. అందుకే ఈ ఓపెన్ లెటర్ అన్న.

అన్నా! నేను మీ పార్టీని, కార్యకర్తల్ని, అధికారులని, మీ అనుబంధ మీడియా సంస్థలని, జనసేన, వీర మహిళలని, వారి కుటుంబ సభ్యులకి నేను అనేక సందర్భాలలో sorry చెప్పడం జరిగింది. అనేక సార్లు నేను రూడ్ గా మాట్లాడటం జరిగింది. మీ అందరిని మళ్ళీ క్షమించమని అడుగుతున్నాను. గత పదిరోజులుగా మాడియాలో వచ్చే కథనాలు, కథనాల కింద మీ కార్యకర్తలు పెట్టే కామెంట్లు, మీ నాయకులు నాపై చేసే కామెంట్లు, speech లు డిస్కషన్ లు, డిబేట్ లు చూసిన తరువాత అలాగే కూటమిలో ఉన్న అందరూ చేసిన attack తరువాత నాకు అర్థమైంది, నేను ఎంతమంది మనోభావాల్ని దెబ్బతీసానో, బాధపెట్టానో అర్ధమైంది. ఇప్పుడు నేను నిజంగా చెప్తున్నా ఒక వెంకటేశ్వరస్వామి భక్తురాలిగా ప్రమాణం చేసి చెపున్నాను మా కులదైవం కూడా) ఇంతమంది మనోభావాలు దెబ్బ తీసేలా జుగుప్సాకర భాషలో నేను మాట్లాడి తప్పు చేశాను. నా పూజలు, భక్తి గురించి బహుగా మీకు తెలిసే అవకాశం లేదు. ఇంత పూజలు, ప్రార్ధనలు చేసే నేను ఈ పాపం ఎలా చేశాను, ఏ కన్ను కావరంతో ఇలా చేసాను నాకు అర్ధం కావడం లేదు. ముందుగా చంద్రబాబునాయుడు గారికి, లోకేష్ గారికి, వారి కుటుంబ సభ్యలకి, హోం మినిస్టర్ గారికి, TV5, ఆంధ్రజ్వోతి, ఐటీడీపీకి, TDP కార్యకర్తలకి, social మీడియాకి Sorry. Janasena Media:- 99tv, prime 9, హృదయపూర్వక sorry.. దయచేసి , social Media ki, పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణలు "మీ అందరూ పెద్దమనసు చేసుకుని 'మీ తెలుగమ్మాయిని క్షమించండి

Published : 
  • 14 November 2024, 12:43 PM IST