బ్రేకింగ్: బంగ్లాదేశ్ కొత్త ప్రధాని ఆయనే..!

రెండేళ్ళ నుంచి అల్లర్లతో ఇబ్బంది పడుతోన్న బంగ్లాదేశ్ లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ తాజాగా జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించింది.

Post Published By: dialnews
Updated : 13 February 2026, 11:13 AM IST

రెండేళ్ళ నుంచి అల్లర్లతో ఇబ్బంది పడుతోన్న బంగ్లాదేశ్ లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ తాజాగా జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. మొత్తం 300 స్థానాలకు గానూ 212 స్థానాల్లో విజయం సాధించింది. మతతత్వ పార్టీ అయిన జమాతే లీగ్ ను ఓడించి.. తారిక్ రెహమాన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బిఎన్‌పి) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.

మాజీ ప్రధాని ఖలీదా జియా కుమారుడు అయిన 60 ఏళ్ల రెహమాన్ 17 ఏళ్ళ తర్వాత దేశానికి తిరిగి వచ్చి ప్రధాని అయ్యారు. మాజీ ప్రధానులు జియా, షేక్ హసీనా లేకుండా జరిగిన తొలి ఎన్నికలు కావడంతో ఈ ఎన్నికలకు ప్రాధాన్యత సంతరించుకుంది. 2024 నుంచి మహ్మద్ యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వమే రాజ్యం ఏలుతోంది. ఇక రెహమాన్ విజయం సాధించడంతో ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేసారు. కలిసి పని చేసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తెలిపారు.

Published : 
  • 13 February 2026, 11:13 AM IST