తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా గడుపుతున్నారు. మొదటి (నిన్న) రోజు ముగ్గురు కేంద్రమంత్రులను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి… పలు విజ్ఞప్తులను వారి ముందు ఉంచారు. కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర విద్యాశాఖామంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర రోడ్డు రవాణా,రహదారుల శాఖా మంత్రి నితిన్ గడ్కరీ తో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి.
