CM KCR has finally seen and heard the Mudirajs agitation for political recognition in Telangana for the past few days
KCR: తెలంగాణ రాజకీయాలు రంజుమీద కనిపిస్తున్నాయ్. గజ్వేల్‌తో పాటు కామారెడ్డిలోనూ కేసీఆర్ పోటీకి సిద్ధం కాగా.. కామారెడ్డిలో కాంగ్రెస్ తరఫున రేవంత్, గజ్వేల్‌లో బీజేపీ తరఫున ఈటల.. కేసీఆర్‌తో ఢీ అంటే ఢీ అంటున్నారు. దీంతో ఏం జరగబోతుందనే ఆసక్తి ప్రతీ ఒక్కరిలో కనిపిస్తోంది. ఐతే కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీకి దిగడం వెనక ప్రధాన కారణం.. కోనాపూర్ అనే గ్రామం. ఇది కేసీఆర్ వాళ్ల అమ్మమ్మవాళ్ల గ్రామం. ఐతే ఇప్పుడు కామారెడ్డి నుంచి కేసీఆర్ బరిలోకి దిగడంతో.. కోనాపూర్ గ్రామం మళ్లీ చర్చకు దారి తీస్తోంది.
KCR: కేసీఆర్‌కు షాకిచ్చిన స్టాలిన్.. కాంగ్రెస్‌కే మద్దతు..!
కామారెడ్డి జిల్లాలోని బీబీపేట మండలంలో కోనాపూర్ గ్రామం ఉంది. ఒకప్పుడు ఈ గ్రామాన్ని పోసానిపల్లి అనేవారు. కేసీఆర్ తల్లి వెంకటమ్మది ఈ ఊరే. కేసీఆర్ తండ్రి స్వగ్రామం సిద్దిపేట జిల్లా ముస్తాబాద్ మండలం మోహినికుంట. ఆయన కోనాపూర్‌కు ఇల్లరికం వచ్చారు. అప్పర్ మానేర్ డ్యామ్‌కు సమీపంలో ఈ గ్రామం ఉంది. 1950లో డ్యామ్ నిర్మాణ సమయంలో ఊరు, భూములు చాలావరకూ మునిగిపోవడంతో.. చాలామంది ఇతర ప్రాంతాలకు వలస పోయారు. కేసీఆర్ తల్లిదండ్రులు కూడా కోనాపూర్ వదిలి చింతమడకకు వెళ్లారు. కేసీఆర్ అక్కాచెల్లెళ్లు కోనాపూర్‌లోనే పుట్టినా, కేసీఆర్ మాత్రం చింతమడకలోనే పుట్టారు. కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేస్తుండటంతో అందరి దృష్టీ కోనాపూర్‌పై పడింది. ప్రస్తుతం కేసీఆర్ అమ్మమ్మ తాలూకు రెండంతస్తుల మేడ ఒకటి కోనాపూర్‌లో ఉంది. అయితే శిథిలావస్థకు చేరడంతో దీనిని ఎవరూ వాడటంలేదు. ఇంటి లోపల పిచ్చి మొక్కలు పెరిగాయి. ఊళ్లో 4వందల వరకూ ఇళ్లు ఉన్నాయి. కోనాపూర్‌ను కేటీఆర్ దత్తత తీసుకుని అభివృద్ధి చేశారు.
రోడ్లు, వంతెనలు నిర్మించారు. కేసీఆర్ రెండున్నర కోట్ల రూపాయల ఖర్చుతో పాఠశాల కట్టించారు. అయితే ఎన్నికల నియమావళి అమలులో ఉండటంతో ఈ పాఠశాల ప్రారంభం కాలేదు. కేసీఆర్ సీఎం అయ్యాక.. ఈ గ్రామ జనాలు సంబరాలు జరుపుకున్నారు. తమ ప్రాంతానికి చెందిన నేత ముఖ్యమంత్రి అయ్యాడంటూ మిఠాయిలు పంచిపెట్టారు. తమ గ్రామానికి చెందిన కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేస్తుండటం పట్ల కోనాపూర్ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.