Top story: మౌనిక…మూడు ముక్కలు… ఒకటి గోనె సంచిలో…మరొకటి ఫ్రిజ్‌లో…!

సమాజంలో చోటు చేసుకుంటున్న దారుణాలు..కంపరం పుట్టిస్తున్నాయి. సైకోయిజమే సిగ్గుపడేలా చేస్తున్నారు. హత్య చేయడమే కాదు... వారిని ముక్కలు చేసే సంస్కృతి పెరిగిపోతోంది.

Post Published By: dialnews
Updated : 31 March 2026, 8:30 PM IST

సమాజంలో చోటు చేసుకుంటున్న దారుణాలు..కంపరం పుట్టిస్తున్నాయి. సైకోయిజమే సిగ్గుపడేలా చేస్తున్నారు. హత్య చేయడమే కాదు... వారిని ముక్కలు చేసే సంస్కృతి పెరిగిపోతోంది. మొన్న ఢిల్లీలో...నిన్న హైదరాబాద్‌లో...తాజాగా వైజాగ్‌లో నేవీ టెక్నిషీయన్ రాక్షసంగా ప్రవర్తించాడు. డబ్బులు కోసం యువతి వేధించిందని హత్య చేసి ముక్కలుగా నరికాడు. రెండు ముక్కలుగా నరికి రెండు భాగాలను ఇంట్లో ఫ్రిజ్​​లో పెట్టాడు. మరో సగ భాగాన్ని గోనె సంచిలో కట్టాడు. ఆ భాగాన్ని తగలబెట్టాడు.

మగాళ్లు...మృగాళ్లుగా మారిపోతున్నారు. రాక్షసులను మించి ప్రవర్తిస్తున్నారు. ఒకడ్ని మించి...మరొకడు క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. సమాజం సిగ్గుపడేలా...కర్కశంగా వ్యవహరిస్తున్నారు. ఢిల్లీలో ఒకడు ప్రియురాలిని చంపేసి ఫ్రిజ్‌లో దాచాడు...హైదరాబాద్‌లో ఇంకొకడు భార్యను హీటర్‌లో వేసి మరిగించాడు. తాజాగా వైజాగ్‌లో...యువతిని మూడు ముక్కలు చేశాడు. కృరత్వానికి అసహ్యం కలిగేలా వ్యవహరించాడు. నేవీలో టెక్నీషియన్‌గా పని చేస్తున్న చింతాడ రవీంద్ర...విశాఖలో ఎల్వి నగర్​లో స్థానికంగా ఓ అపార్టుమెంట్‌లో నివాసం ఉంటున్నాడు.

అతడి భార్య నెల క్రితం ప్రసవం కోసం విజయనగరంలోని పుట్టింటికి వెళ్లింది. దీంతో విశాఖకు చెందిన మౌనికను...మాట్లాడుకుందామంటూ ఇంటికి ఆహ్వానించాడు రవీంద్ర. అతడి మాయమాటలు నమ్మిన మౌనిక...ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు ఎల్​వీ నగర్‌లోని కీర్తి అపార్టుమెంట్‌కు మౌనిక వచ్చింది. ఆ పై ఇరువురూ ఇంట్లో కాసేపు చర్చించుకున్నారు. ఆ తర్వాత మౌనిక, రవీంద్ర మధ్య వాదోపవాదలు జరిగాయి. సహనం కోల్పోయిన రవీంద్ర...తనలో రాక్షసుడ్ని బయటకు రప్పించాడు. అత్యంత పాశవికంగా మౌనికను హత్య చేశాడు. చనిపోయిందని నిర్దారించుకున్న తర్వాత...మృతదేహాన్ని రెండు ముక్కలుగా నరికేశాడు. సగ భాగాన్ని ఇంట్లో ఫ్రిజ్​లో పెట్టాడు. మరో సగ భాగాన్నిగోనె సంచిలో భద్రపరిచాడు.

మౌనిక హత్య కోసం ముందుగానే గాజువాకలో రవీంద్ర కత్తులు కొన్నట్లు తెలుస్తోంది. మౌనిక శరీరాన్ని మూడు భాగాలుగా ముక్కలు చేసి రెండు భాగాలు ఫ్రిజ్​​లో...ఉంచి తలభాగం విశాఖ దారపాలెంలో పడేశౄడు. ఆదివారం రాత్రి మౌనిక తల, ఆమె ఫోన్ దారపాలెం తోటల్లో తగలబెట్టాడు. హత్య చేసిన తర్వాత రవీంద్ర రక్తపు మరకలు కడిగి, వాసన రాకుండా సెంట్​ కొట్టాడు. హత్య అనంతరం స్నేహితుడికి ఫోన్ చేశాడు. అతడి సూచన మేరకు పోలీసులకు లొంగిపోయినట్లు తెలిసింది.

లాక్‌డౌన్‌ సమయం నుంచే మౌనికతో రవీంద్రకు పరిచయం ఉన్నట్లు తెలిసింది. డేటింగ్ యాప్‌లో రవీంద్రకు మౌనిక పరిచయమైనట్లు సమాచారం. మౌనికకు ఇప్పటి వరకు 3.50 లక్షలు ఇచ్చినట్లు పోలీసులకు రవీంద్ర చెప్పారు. ఉద్యోగ ఐడీ కార్డు కూడా తీసుకుని డబ్బు డిమాండ్ చేసినట్లు తెలిపాడు. డబ్బు విషయాన్ని మాట్లాడేందుకు అపార్టుమెంట్‌కు పిలిపించినట్లు విచారణలో తేలింది. వచ్చిన కాసేపటికే రవీంద్ర, మౌనిక మధ్య ఘర్షణ జరిగినట్లు సమాచారం. ఘర్షణ తర్వాతే హత్య జరిగినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. మౌనిక డబ్బు కోసం తరచూ వేధించేదని పోలీసుల ముందు చెప్పాడు రవీంద్ర. ఆమె వేధింపులు తట్టుకోలేక...హత్య చేసినట్లు నిందితుడు పోలీసులకు వెల్లడించాడు. నిందితుని స్వస్థలం విజయనగరం జిల్లా రాజాంగా అధికారులు గుర్తించారు.

Published : 
  • 31 March 2026, 8:30 PM IST