చుట్టూ వరద నీరు. బురద. వందలాది శవాలు. ఇళ్లల్లో ఇరుక్కుపోయిన జనం. చెట్టు పుట్టపై గజగజ వణుకుతూ వేలాది జనం. ఏ క్షణానైనా ప్రాణాల పోయే పరిస్థితి. అలాంటి కండిషన్లో హెలికాప్టర్‌పై ఓ దేవత వచ్చింది. ప్రాణాలకు తెగించి వాళ్ళందర్నీ కాపాడింది. ఒకటి రెండు కాదు. 100 రిస్క్యూ ఆపరేషన్లు చేసిందామె. వెయ్యి మందికి పైగా జనాన్ని కాపాడింది. ఆమె నేపాల్ ఫస్ట్ ఉమెన్ హెలికాప్టర్ కెప్టెన్ ప్రియా అధికారి.ఆమె వయస్సు 40 ఏళ్లు. ప్రతికూల పరిస్థితుల్లోనూ, రెస్క్యూ ఆపరేషన్లు చేపట్టేందుకు ముందుంటుంది. నేపాల్‌లో జల ప్రళయం లో ఈ మహిళా పైలట్ సాహసోపేతంగా చేస్తున్న ఆపరేషన్లకు ..ఆ దేశ వాసులే కాదు..యావత్ ప్రపంచం శెభాష్ అంటోంది. ధీర వనిత,కెప్టెన్ ప్రియా అధికారి కేవలం ఆరు రోజుల్లోనే 100 రెస్క్యూ ఆపరేషన్లను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసింది.
వెయ్యి మందికి పైగా వరద బాధితులని ప్రాణాలతో కాపాడింది. నేపాల్‌లో ఆకస్మిక వరదలు సృష్టించిన విషాదం నుంచి వారం అయినా తేరుకోలేకపోతున్నారు ఆ దేశ ప్రజలు. వరదలు ముంచెత్తినవెంటనే ఆ ప్రళయంలో గల్లంతైన వారిని, శిథిలాల కింద చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకుచ్చేందుకు సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది నేపాల్ ఆర్మీ. ప్రతికూల వాతావరణంలోనూ హెలికాప్టర్ల ద్వారా బాధితులను కాపాడి ఆసుపత్రులకు తరలించారు. ఈ ఆపరేషన్‌లో ముందు వరుసలో ఉన్నారు నేపాల్ తొలి మహిళా హెలికాప్టర్ ఆర్మీ కెప్టెన్ ప్రియా అధికారి. ఈమె నేతృత్వంలో ఆరు రోజుల్లోనే సుమారు 100 రెస్క్యూ ఆపరేషన్లను పూర్తి చేశారు.
వరదల ప్రభావం ఎక్కువగా ఉన్న రసువా జిల్లాలోని తైమూర్‌లో వరద బాధితులను రక్షించేందుకు 20 హెలికాప్టర్లు తిరుగుతున్నాయి. ఈ ఆపరేషన్‌లో ఎంతో ధైర్యసాహసాలు కనబరుస్తున్నారు ప్రియా అధికారి. ప్రతికూల వాతావరణ పరిస్థితులను లెక్క చేయకుండా, సవాళ్ల నడుమ సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నారు. వరద బురదలో హెలికాప్టర్లను ల్యాండ్ చేయడానికి వీల్లేని పరిస్థితులున్నాయి. ఒక్కో సారి ఒకే ప్రాంతంలో ఐదారు హెలికాప్టర్లు దిగుతున్నాయి. బాధితులను గుర్తించి వారిని సురక్షిత ప్రాంతాలు కు, గాయపడిన వాళ్లని ఆసుపత్రులకు తరలించడానికి రేడియో ద్వారా సమన్వయం చేసుకుంటు..... రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించింది కెప్టెన్ ప్రియా అధికారి. భారీగా బురద ఉన్న ప్రాంతాల నుంచి హెలికాప్టర్లలో బాధితులను తరలించడం అత్యంత రిస్క్‌తో కూడుకున్న పని అని, దీంతో ఈ ఆపరేషన్ కొనసాగుతున్నంత సేపు పైలట్లు అప్రమత్తంగా ఉండాల్సిందే. తొలి రెండు రోజుల్లో 500 మంది కాపాడింది ఈ ధీర వనిత. ఆ తర్వాత మరో ఐదారు వందల మందిని రక్షించింది ప్రియా అధికారి.
వరద విలయం లో మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉండటాన్ని కళ్లారా చూశామని ఆమె చెప్పండి వస్తారు చెప్తా నేను ఈరోజు ఒకవేళ నా కలవడం కుదరకపోతే మీరు రేపల్లె ఆవేదన వ్యక్తం చేశారు. జలవిద్యుత్ ప్రాజెక్టులు కొట్టుకుపోయాయని, గతంలో తామెన్నడూ చూడని ప్రాణనష్టం సంభవించిందని తెలిపారు. వరుస ప్రయాణాలతో పైలట్లు చాలా అలసిపోయారని.. అయినప్పటికీ వరదలో చిక్కుకుపోయిన జనాన్ని రక్షిస్తూనే ఉన్నామన్నారు. ఇంత విషాదంలోనూ బాధితులను గుర్తించి రక్షిస్తుంటే తన ముఖంలో నవ్వు విరుస్తోందని, బాధితులను తరలిస్తున్నప్పుడు తీవ్ర భావోద్వోగానికి లోనయ్యాయని చెప్పింది. ప్రియా అధికారి ..బీఎస్సీ ఎన్విరాన్మెంటల్ సైన్స్ చదివింది. అప్పుడు ఓసారి హెలికాప్టర్ రైడ్‌కు వెళ్లింది. ఆ విహారయాత్ర ఈమె కెరీర్‌ను మార్చేసింది. ఆ క్షణంలోనే పైలట్ కావాలని నిర్ణయించుకుంది. తొలుత ఐదేళ్ల పాటు క్యాబిన్ క్రూగా పనిచేసింది. ఆ తర్వాత ఫిలిప్పీన్స్‌కు వెళ్లి హెలికాప్టర్ పైలట్ శిక్షణ తీసుకుంది.
కెప్టెన్ హోదాకు అవసరమైనన్ని గంటలు హెలికాప్టర్ నడిపింది. చివరికి నేపాల్‌లో హెలికాప్టర్ తొలి మహిళా కెప్టెన్ అయ్యారు. 2017 నుంచి పూర్తిస్థాయి పైలట్‌గా మారారు. ఎత్తైన హిమాలయ పర్వతాల్లో సెర్చ్-రెస్క్యూ ఆపరేషన్లు చేయడంలో రాటు తేలింది ప్రియా. ఎవరెస్టు పర్వతాల్లో గాయపడిన వారిని రక్షించారు. 6,200 మీటర్ల ఎత్తులో చేపట్టిన సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్లలో పాల్గొని ఎవరెస్టులో చిక్కుకున్నవారిని కాపాడని ధీశాలి ఈమె. ఆ నైపుణ్యమే ఇప్పుడు మెరుపు వరదల తర్వాత రెస్క్యూ ఆపరేషన్ల చేసి జనాన్ని కాపాడడానికి ఉపయోగపడుతుంది. కెరీర్ ఆరంభంలో ఎన్నో అడ్డంకులు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించానని, ప్రమాదకర పరిస్థితుల్లో ఆపరేషన్ చేపట్టేందుకే తాను శిక్షణ పొందామని ధైర్యంగా చెబుతోంది. హై ఆల్టిట్యూడ్ రెస్క్యూ పైలట్‌గా అనుభవం ఉన్న ప్రియా అధికారి ..రసువా జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో వందల మంది ప్రాణాలను కాపాడింది. పురుషులతో ధీటుగా ఈ రెస్క్యూ ఆపరేషన్లలో పాల్గొంటూ...బురద మేటల్లోనూ హెలికాప్టర్‌ను ల్యాండ్ చేస్తోంది. ఇంజిన్ ఆపకుండానే నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో చిక్కుకున్నవారిని హెలికాప్టర్లో ఎక్కించుకుని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కష్టకాలంలో ఎంతో మంది ప్రాణాలు కాపాడి ఆపద్బాంధవురాలిగా నిలవడమే కాదు.... ఏకైక మహిళా రెస్క్యూ హెలికాప్టర్ పైలట్‌గా ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు ప్రియా అధికారి.