కౌంటర్ అంటే ఇది, షేక్ చేస్తున్న అన్నాడిఎంకే వీడియో..!

తమిళనాట ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై ప్రతిపక్ష అన్నాడిఎంకే తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది.

Post Published By: dialnews
Updated : 18 February 2026, 12:28 PM IST

తమిళనాట ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై ప్రతిపక్ష అన్నాడిఎంకే తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. తాత్కాలిక రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ ను విమర్శిస్తూ ఓ వీడియోను, ఆహ్వాన పత్రికను రిలీజ్ చేసింది అన్నాడిఎంకే. ఒక్క వీడియోతో నేషనల్ వైడ్ గా ఓ ట్రెండ్ సెట్ చేసింది. బడ్జెట్‌ ను సాధారణ రాజకీయ నాయకుల్లా విమర్శించకుండా, జరుగుతోన్న అన్యాయాన్ని ప్రజలకు అర్ధమయ్యేలా డిఫరెంట్ కాన్సెప్ట్ తో కొట్టింది. ఏకంగా ఓ వేడుకకు ముహూర్తం ఫిక్స్ చేసి, ఆహ్వాన పత్రికను సభకు తీసుకొచ్చింది.

రాష్ట్ర ఆర్ధిక శాఖా మంత్రి తంగం తెన్నరసు చేసిన వ్యాఖ్యలపై కూడా మండిపడింది. ఈ బడ్జెట్ చిన్న పిల్లలకు చెవులు కుట్టించే కార్యక్రమంగా అభివర్ణిస్తూ.. ఓ వీడియో రిలీజ్ చేసింది. ఓ పెద్ద సూది పట్టుకుని, ప్రజలకు అన్నాడిఎంకే నేతలు చెవులు కుడుతూ ఉంటారు. వారిని చూస్తే, ప్రజలు భయపడి పరుగులు తీసే విధంగా వీడియో రెడీ చేసారు. అలాగే 'బడ్జెట్ పేరుతో తమిళనాడు ప్రజలకు డీఎంకే ప్రభుత్వం చెవులు కుట్టే కార్యక్రమం నిర్వహిస్తోంది' అని ఆరోపిస్తూ ఓ ఆహ్వాన పత్రికతో సభలో అడుగుపెట్టారు ఎమ్మెల్యేలు.

ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది. గ్రాండ్ ఇయర్ పియర్సింగ్ ఫెస్టివల్ గా ఆరోపిస్తూ.. గత నాలుగున్నర సంవత్సరాలుగా బడ్జెట్ పేరుతో తమిళనాడు ప్రజల కోసం నిర్వహిస్తున్న ఈ గొప్ప చెవులు కుట్టే ఉత్సవం ఈ ఏడాది కూడా అంగరంగ వైభవంగా జరగనుందని పేర్కొంది. అందుకు ముహూర్తం కూడా పెట్టింది. తేదీ: ఫిబ్రవరి 17, 2026, స్థలం : తమిళనాడు శాసనసభ, సమయం: ఉదయం 10 గంటల నుండి 'ఈ ఉత్సవానికి ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్, చెవులు కుట్టే కార్యక్రమానికి ఆర్థిక మంత్రి తంగం తమరసు నాయకత్వం వహిస్తారని ఆరోపణలు చేసింది. తెలుగు నాట కూడా ఈ వీడియో వైరల్ కావడం గమనార్హం.

Published : 
  • 18 February 2026, 12:28 PM IST