Top story:ట్రంప్ పై వైట్ హౌస్ లో తిరగబడ్డ అమెరికా ఆర్మీ ఆర్డర్ లేదు బొక్క లేదు.. వైట్ హౌస్ లో ‘సివిల్ వార్’ ఇరాన్ తో ఇక యుద్ధం చేయలేం, ఆపాల్సిందే…!

ఇప్పటిదాకా మనం బయట జరిగిన యుద్ధం చూశాం.. కానీ ఇప్పుడు వైట్ హౌస్ గోడల మధ్య అసలైన 'సివిల్ వార్' మొదలైంది. ఒకవైపు ఇరాన్ క్షిపణులు అమెరికా గర్వాన్ని మట్టికరిపిస్తుంటే, మరోవైపు వాషింగ్టన్ లోపల పెంటగాన్ అధికారులకు, వైట్ హౌస్

Post Published By: dialnews
Updated : 21 April 2026, 2:20 PM IST

ఇప్పటిదాకా మనం బయట జరిగిన యుద్ధం చూశాం.. కానీ ఇప్పుడు వైట్ హౌస్ గోడల మధ్య అసలైన 'సివిల్ వార్' మొదలైంది. ఒకవైపు ఇరాన్ క్షిపణులు అమెరికా గర్వాన్ని మట్టికరిపిస్తుంటే, మరోవైపు వాషింగ్టన్ లోపల పెంటగాన్ అధికారులకు, వైట్ హౌస్ సలహాదారులకు మధ్య యుద్ధం నడుస్తోంది. "మేము ఇంకా పోరాడలేం.. ఆయుధాలు ఫెయిల్ అవుతున్నాయి" అని సైన్యం మొత్తుకుంటుంటే, ట్రంప్ మాత్రం "తగ్గేదే లేదు" అని భీష్మించుకుని కూర్చున్నారు. అమెరికా పతనం బయట కాదు.. లోపలే మొదలైంది.

పెంటగాన్ అంటే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైనిక కేంద్రం. కానీ ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏంటో తెలుసా..? ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణుల వేగాన్ని చూసి అమెరికా జనరల్స్ వణికిపోతున్నారు. థాడ్ వ్యవస్థలు కుప్పకూలడం, పేట్రియాట్ క్షిపణులు గాలిలో కలిసిపోవడంతో పెంటగాన్ అధికారులకు క్లారిటీ వచ్చేసింది. "ఇరాన్ టెక్నాలజీ ముందు మన పాత సామాన్లు పని చేయవు" అని. అందుకే వారు వైట్ హౌస్‌కు ఒకటే రిపోర్ట్ ఇచ్చారు.. "మనం ఇంకా ఈ యుద్ధాన్ని కొనసాగించలేం, అది ఆత్మహత్యాసదృశ్యం" అని.

కానీ వైట్ హౌస్ లో ఉన్న రాజకీయ సలహాదారులు మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ ఈ ఓటమిని ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు. తన ఇమేజ్ దెబ్బతింటుందని, ఆయుధ ఒప్పందాలు రద్దవుతాయని ఆయన భయపడుతున్నారు. సైన్యం "వద్దు" అంటున్నా, ట్రంప్ మాత్రం "అటాక్ చేయండి" అని ఒత్తిడి తెస్తున్నారు. ఇక్కడే అసలైన 'సివిల్ వార్' మొదలైంది. సైనికుల ప్రాణాల కంటే తన రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని ట్రంప్ భావిస్తుంటే, పెంటగాన్ అధికారులు మాత్రం "మా దగ్గర దమ్మున్న ఆయుధాలు లేవు బాబోయ్" అని నెత్తీనోరు కొట్టుకుంటున్నారు.

పెంటగాన్ జనరల్స్ ఒక భయంకరమైన నిజాన్ని బయటపెట్టారు. అదేంటంటే.. 'మా దగ్గర క్షిపణులు లేవు, ఉన్నవి ఇరాన్ వేగాన్ని తట్టుకోలేవు. సముద్రంలో ఉన్న మా యుద్ధ నౌకలకు మందుగుండు సామగ్రిని రీఫిల్ చేయాలంటే గల్ఫ్ దేశాలు సహకరించడం లేదు. ఇది సైనిక పరంగా మాకు నరకం' అని వైట్ హౌస్‌లో మొత్తుకుంటున్నారు. ఒకవైపు సైన్యం వద్దు అంటుంటే, ఆయుధ కంపెనీలు మాత్రం యుద్ధం జరగాలని కోరుకుంటున్నాయి. ఆయుధాలు తయారు చేసే కంపెనీల ప్రతినిధులు ట్రంప్‌పై ఒత్తిడి తెస్తున్నారు.

'మీరు యుద్ధం ఆపేస్తే మా షేర్ మార్కెట్ పడిపోతుంది, మా కంపెనీలు మూతపడతాయి' అని వారు బెదిరిస్తున్నారు. అంటే అమెరికన్ సైనికుల ప్రాణాల కంటే, ఈ కంపెనీల లాభాలే ట్రంప్‌కు ముఖ్యం అన్నట్టుగా సీన్ తయారైంది. కానీ.. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పెంటగాన్ లోని కొందరు ఉన్నతాధికారులు ట్రంప్ ఇచ్చే 'అగ్రెసివ్' ఆర్డర్లను పెండింగ్‌లో పెడుతున్నారట. 'తప్పుడు నిర్ణయాలతో వేలమంది సైనికులను బలి ఇవ్వలేం' అని వారు తెగేసి చెబుతున్నారు. వైట్ హౌస్ ఇచ్చే ఆర్డర్లు, పెంటగాన్ చేసే పనులు అసలు మ్యాచ్ అవ్వడం లేదు.

అమెరికా పవర్ సెంటర్ ముక్కలైపోయింది. ఇప్పుడు వైట్ హౌస్ లో మెజారిటీ అధికారులు ఒకటే డిమాండ్ చేస్తున్నారు. "వెంటనే ఇరాన్ తో చర్చలకు వెళ్లి.. ఏదొకటి చేసి ఒప్పించండి. లేదంటే అమెరికా సర్వనాశనం అవుతుంది" అని ట్రంప్ పై ఒత్తిడి తెస్తున్నారు. గల్ఫ్ దేశాలు ఇప్పటికే అమెరికాకు తలుపులు మూసేశాయి, సొంత ఆయుధాలు తుస్సుమన్నాయి.. ఇక మిగిలింది కేవలం దౌత్యపరమైన చర్చలు మాత్రమే. జేడీ వాన్స్ పాకిస్థాన్ వెళ్తున్నది కూడా అందుకే. పెంటగాన్ ఒత్తిడి తట్టుకోలేక, పరువు కాపాడుకోవడానికి అమెరికా ఇప్పుడు ఇరాన్ కాళ్ళ దగ్గరకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది.

ఈ అంతర్గత కలహాలు అమెరికాను ప్రపంచ దేశాల ముందు నవ్వులపాలు చేస్తున్నాయి. ఇరాన్ మాత్రం తన ఐకమత్యంతో, శక్తివంతమైన వ్యూహాలతో అమెరికాను కోలుకోలేని దెబ్బ తీసింది. ఒక సామ్రాజ్యం లోపల గొడవలు మొదలయ్యాయంటే దాని పతనం దగ్గరపడినట్టే. పెంటగాన్ వైఫల్యం, వైట్ హౌస్ లో అశాంతి.. ఇవన్నీ చూస్తుంటే ఇరాన్ తన లక్ష్యాన్ని చేరుకుందని అర్థమవుతోంది. అమెరికా గర్వం ఇప్పుడు ఇరాన్ పాదాల చెంత ముక్కలై పడి ఉంది.

నిజానికి ఇరాన్ ఒకే దెబ్బకు రెండు పిట్టలను కొట్టింది. సరిహద్దుల్లో అమెరికా ఆయుధాలను బూడిద చేసింది, వాషింగ్టన్ లోపల అధికారుల మధ్య చిచ్చు పెట్టింది. అమెరికా బలహీనతను ప్రపంచానికి చాటి చెప్పడంలో ఇరాన్ మాస్టర్ మైండ్ గేమ్ పక్కాగా వర్కవుట్ అయింది. యుద్ధం ముగియకముందే ఇరాన్ సగం విజయం సాధించేసింది. అమెరికా అంటే ఒకప్పుడు ఐకమత్యానికి నిదర్శనం.. కానీ ఇరాన్ దెబ్బకు ఇప్పుడు ఆ దేశం 'వార్ జోన్' గా మారింది. బయట ఇరాన్ మిస్సైల్స్, లోపల పెంటగాన్ తిరుగుబాటు.. ట్రంప్ సామ్రాజ్యం పేకమేడలా కూలిపోతోంది. అమెరికా లోపల జరుగుతున్న ఈ 'సివిల్ వార్' ఆ దేశాన్ని ఎటు తీసుకెళ్తుందో. ఇరాన్ విజయం ఖాయమైపోయింది, అమెరికా ఓటమి రాసిపెట్టి ఉంది.

Published : 
  • 21 April 2026, 2:20 PM IST