Top story: ఏపీపై విజయ్ ఫోకస్..? సరిహద్దుల్లో మాస్టర్ ప్లాన్..? టీవీకే పార్టీ బలోపేతం కోసం అడుగులు..!

నమస్తే వణక్కం.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ద్రవిడ పార్టీల కోటలను బద్దలు కొట్టి.. చారిత్రాత్మక విజయంతో తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన 'దళపతి' సి. జోసెఫ్ విజయ్.. ఇప్పుడు సౌత్ పాలిటిక్స్‌లో మరో బిగ్ స్కెచ్ వేస్తున్నారా?

Post Published By: dialnews
Updated : 1 September 2026, 3:29 PM IST

నమస్తే వణక్కం.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ద్రవిడ పార్టీల కోటలను బద్దలు కొట్టి.. చారిత్రాత్మక విజయంతో తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన 'దళపతి' సి. జోసెఫ్ విజయ్.. ఇప్పుడు సౌత్ పాలిటిక్స్‌లో మరో బిగ్ స్కెచ్ వేస్తున్నారా? అవుననే అంటున్నాయి తాజా పొలిటికల్ అప్‌డేట్స్. తమిళనాడు సీఎం అయిన తర్వాత.. విజయ్ తన 'తమిళగ వెట్రి కళగం' పార్టీని కేవలం ఒక్క రాష్ట్రానికే పరిమితం చేయకూడదని డిసైడ్ అయ్యారు. కేరళ, కర్ణాటక, చివరకు మన ఆంధ్రప్రదేశ్‌లో కూడా పార్టీని విస్తరించి, బలమైన క్యాడర్‌ను నిర్మించడానికి పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. ముఖ్యంగా కేరళలో పార్టీ బాధ్యతలను ఒక సీనియర్ సినీ నటుడి చేతిలో పెట్టబోతున్నారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అసలు ఎవరా నటుడు? సీఎం విజయ్ పొలిటికల్ మాస్టర్ ప్లాన్ ఏంటి? బోర్డర్ స్టేట్స్‌లో ఆయన వేస్తున్న అడుగులు ఎలాంటివి?

తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక.. విజయ్ తన పొరుగు రాష్ట్రమైన కేరళపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఎందుకంటే కేరళలో విజయ్‌కి ఉన్న ఫ్యాన్ బేస్ అంతా ఇంతా కాదు. అక్కడ ఆయన సినిమాలకు వచ్చే క్రేజ్‌ను, ఇప్పుడు తన సరికొత్త రాజకీయ ఇమేజ్‌ను ఉపయోగించి పార్టీని బలోపేతం చేయాలని చూస్తున్నారు. ఇందుకోసం కేరళ TVK ప్రెసిడెంట్‌గా ఒక బలమైన ముఖాన్ని సీఎం విజయ్ ఎంచుకున్నారు. ఆ ముఖమే.. సీనియర్ సినీ నటుడు దేవన్. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఎన్నో విలన్, క్యారెక్టర్ రోల్స్ చేసిన దేవన్.. కేరళ రాజకీయాల్లో కూడా చాలా యాక్టివ్‌గా ఉన్నారు.

అయితే ఇక్కడో ట్విస్ట్ ఉంది బాస్. దేవన్ ఇటీవల కాలంలోనే బీజేపీకి రాజీనామా చేసేశారు. ఎప్పుడైతే ఆయన బీజేపీని వీడారో.. అప్పటినుంచే ఆయన టీవీకే వైపు అడుగులు వేస్తున్నారనే ప్రచారం మొదలైంది. తాజా సమాచారం ప్రకారం, వచ్చే సెప్టెంబర్ 10వ తేదీన దేవన్ నేరుగా తమిళనాడు సీఎం విజయ్‌తో ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారు. ఈ భేటీ ముగిసిన వెంటనే.. కేరళ రాష్ట్ర TVK అధ్యక్షుడిగా దేవన్ పేరును అధికారికంగా అనౌన్స్ చేసే ఛాన్స్ ఉందని పొలిటికల్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది.

నిజానికి కేరళలో విజయ్ పార్టీ సున్నా నుంచి మొదలుపెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ చాలా జిల్లాల్లో ఇప్పటికే విజయ్ ఫ్యాన్స్ అసోసియేషన్స్ క్షేత్రస్థాయిలో చాలా బలంగా ఉన్నాయి. పైగా విజయ్ తమిళనాడు సీఎం అయ్యాక అక్కడ క్యాడర్‌లో జోష్ డబుల్ అయింది. ఈ ఫ్యాన్ బేస్‌ను ఒక పద్ధతి ప్రకారం పార్టీ క్యాడర్‌గా మార్చడమే ఇప్పుడు సీఎం విజయ్ ముందున్న టాస్క్. ఇందుకోసం కేరళ అంతటా పార్టీ విస్తరణకు సన్నాహక శిబిరాలు నిర్వహించేందుకు టీవీకే టాప్ లీడర్‌షిప్ ప్లాన్ చేస్తోంది.

దేవన్ లాంటి సీనియర్ మరియు అనుభవజ్ఞుడైన నాయకుడు తోడైతే.. కేరళలో సీఎం విజయ్ మార్కు పాలిటిక్స్‌ను మరింత వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్లవచ్చని భావిస్తున్నారు. అందుకే సెప్టెంబర్ 10 భేటీపై అటు కేరళ పాలిటిక్స్‌లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సరే.. కేరళ సంగతి పక్కన పెడితే.. మన తెలుగు రాష్ట్రాలు, అలాగే కర్ణాటక పరిస్థితి ఏంటి? తమిళనాడు సీఎం విజయ్ అక్కడ కూడా కమిటీలు వేస్తున్నారా? అంటే.. దానికి కూడా విజయ్ దగ్గర ఒక మైండ్ బ్లోయింగ్ ప్లాన్ ఉంది. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక రాష్ట్రాల్లో కూడా పార్టీని విస్తరించడంపై అంతర్గత చర్చలు ముమ్మరంగా సాగుతున్నాయి.

దీనికోసం సీఎం విజయ్ ఒక బోర్డర్ స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు. తమిళనాడు సరిహద్దుల్లో ఉండే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రాంతాల్లో.. అంటే తెలుగు మరియు తమిళ ప్రజలు, లేదా కన్నడ మరియు తమిళ ప్రజలు ఎక్కువగా కలిసి నివసించే బోర్డర్ నియోజకవర్గాలను విజయ్ టార్గెట్ చేస్తున్నారు. మన ఆంధ్రాలోని చిత్తూరు, నెల్లూరు జిల్లాల సరిహద్దులు, అలాగే బెంగళూరు పరిసర ప్రాంతాల్లో తమిళ ఓటర్ల ప్రభావం ఎక్కువ. అలాంటి చోట్ల ముందుగా 'టీవీకే' కమిటీలను వేసి, పార్టీ ఉనికిని చాటాలని చూస్తున్నారు. తమిళనాడులో ముఖ్యమంత్రిగా సంచలనాలు సృష్టిస్తున్న విజయ్.. ఈ బోర్డర్ ఏరియాల్లో ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తారో చూడాలి.ఇదీ తమిళనాడు సీఎం దళపతి విజయ్ ‘తమిళగ వెట్రి కళగం’ సౌత్ ఇండియా వైడ్ విస్తరణ ప్లాన్! సినిమాలో వన్ అండ్ ఓన్లీ దళపతిగా నిలిచిన విజయ్.. ఇప్పుడు సీఎం కుర్చీలో కూర్చుని పొరుగు రాష్ట్రాల్లో కూడా జెండా పాతడానికి రెడీ అవుతున్నారు.

Published : 
  • 1 September 2026, 3:29 PM IST