టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్లో అత్యంత వేగంగా సెంచరీ బాదిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఫైనల్లో 55 బంతుల్లో సెంచరీ చేయడం ద్వారా వైభవ్ సూర్యవంశీ ఈ ఫీట్ సాధించాడు. అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్లో సెంచరీ బాదిన అతని పిన్న వయస్కుడు కూడా వైభవ్ సూర్యవంశీనే. 14 ఏళ్ల వయసులోనే వైభవ్ సూర్యవంశీ ఈ ఫీట్ సాధించాడు. ఈ విధ్వంసకర శతకంతో అరుదైన రికార్డులను వైభవ్ సూర్యవంశీ తన పేరిట లిఖించుకున్నాడు.ఐసీసీ టోర్నీల చరిత్రలోనే ఫైనల్లో అత్యంత వేగంగా సెంచరీ బాదిన బ్యాటర్‌గా కూడా వైభవ్ సూర్యవంశీ రికార్డుకెక్కాడు. పురుషుల, మహిళల ఐసీసీ టోర్నీల ఫైనల్లోనూ వైభవ్ సూర్యవంశీ కంటే వేగంగా ఎవరూ శతకం సాధించలేదు.
అండర్ 19 ప్రపంచకప్ చరిత్రలోనే అత్యంత వేగంగా శతకం బాదిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు.అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్స్ చరిత్రలోనే అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసిన బ్యాటర్‌గా కూడా వైభవ్ సూర్యవంశీ చరిత్రకెక్కాడు. ఈ ఫీట్ సాదించిన మూడో భారత బ్యాటర్‌గా కూడా వైభవ్ నిలిచాడు. అతని కంటే ముందు ఉన్మక్త చంద్, మన్జోత్ కల్రా ఫైనల్లో భారత్ తరఫున శతకాలు నమోదు చేశారు. అండర్ 19 ప్రపంచకప్ చరిత్రలోనే అత్యంత వేగంగా 150 పరుగులు చేసిన బ్యాటర్‌గా కూడా వైభవ్ సూర్యవంశీ రికార్డుకెక్కాడు.
ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ తన విశ్వరూపం చూపించాడు. 15 సిక్స్‌లు, 15 ఫోర్లతో ఇంగ్లండ్ బౌలర్లను ఊచకోత కోసాడు. ఈ మ్యాచ్‌లో 32 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న వైభవ్ సూర్యవంశీ.. మరో 23 బంతుల వ్యవధిలోనే శతకాన్ని అందుకున్నాడు. మరో 16 బంతుల వ్యవధిలోనే 150 పరుగుల మార్క్ ధాటాడు. డబుల్ సెంచరీ దిశగా సాగిన అతన్ని ఇంగ్లండ్ బౌలర్ మన్నీ లమ్స్‌డెన్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఓవరాల్ గా 80 బంతుల్లో 15 ఫోర్లు, 15 సిక్సర్లతో 175 పరుగులకు ఔటయ్యాడు.