టీ20 సిరీస్ పరాజయాల తర్వాత వన్డే ఫార్మాట్లోకి మారిన టీమిండియా అద్భుత విజయంతో బోణీ కొట్టింది. మంగళవారం జరిగిన మొదటి వన్డేలో ఇంగ్లాండ్‌పై భారత్ 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టును భారత బౌలర్లు కట్టడి చేశారు. అక్షర్ పటేల్ 4 వికెట్లతో చెలరేగగా.. ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్ రెండేసి వికెట్లు పడగొట్టారు.
దీంతో ఇంగ్లాండ్ 47.5 ఓవర్లలో 258 పరుగులకు ఆలౌట్ అయింది. 259 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. సీనియర్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ నిరాశపరిచారు.కష్టాల్లో ఉన్న జట్టును కెప్టెన్ శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ సహాయంతో ఆదుకున్నాడు. అనంతరం అక్షర్ పటేల్ , వాషింగ్టన్ సుందర్ బాధ్యతాయుతంగా ఆడి, మరో 4.4 ఓవర్లు మిగిలి ఉండగానే భారత్‌ను విజయతీరాలకు చేర్చారు.ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.