భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న హోరాహోరీ టీ20 సిరీస్ ఇప్పుడు అత్యంత ఆసక్తికరమైన దశకు చేరుకుంది. రెండో మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఘనవిజయం సాధించడంతో సిరీస్ ఉత్కంఠగా మారింది. ఈ నేపథ్యంలో నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్ బ్రిడ్జ్ మైదానంలో జరగబోయే మూడో టీ20 మ్యాచ్‌పై సర్వత్రా భారీ అంచనాలు నెలకొన్నాయి. క్రికెట్ ప్రపంచంలో నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్ బ్రిడ్జ్ మైదానానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ పిచ్ సాధారణంగా బ్యాటర్లకు స్వర్గధామంగా నిలుస్తుంది. ఇక్కడ బంతి బ్యాట్‌పైకి చాలా చక్కగా వస్తుంది, దీనివల్ల భారీ స్కోర్లు నమోదు కావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి.
మ్యాచ్ ప్రారంభంలో పిచ్ నుంచి ఫాస్ట్ బౌలర్లకు మంచి స్వింగ్, బౌన్స్ లభించినప్పటికీ, బ్యాటర్లు ఒక్కసారి క్రీజులో సెట్ అయితే ఇక పరుగుల వరద పారించడం ఖాయం.ఈ పిచ్‌పై టాస్ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్ చేయడానికి మొగ్గు చూపే అవకాశం ఉంది. ఎందుకంటే మ్యాచ్ జరిగే కొద్దీ, రెండో ఇన్నింగ్స్ సమయానికి పిచ్ కొద్దిగా నెమ్మదిస్తుంది. దీనివల్ల లక్ష్యాన్ని చేధించడం కాస్త కష్టతరంగా మారుతుంది. అందువల్ల ఇరు జట్ల కెప్టెన్లు టాస్ గెలిచి పరుగుల పండగ చేసుకోవాలనే వ్యూహంతో బరిలోకి దిగే ఛాన్సుంది.ఈ చారిత్రాత్మక మైదానంలో ఇప్పటివరకు జరిగిన అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల రికార్డులను పరిశీలిస్తే పిచ్ స్వభావం స్పష్టంగా అర్థమవుతుంది.
14 మ్యాచ్ లలోమొదట బ్యాటింగ్ చేసిన జట్లు 8 సార్లు గెలిచాయి. ఛేజింగ్ జట్లు ఆరు సార్లు విజయం సాధించాయి. ఇక్కడ హయ్యెస్ట్ స్కోరు 231 రన్స్ గా ఉంటే... సక్సెస్ ఫుల్ ఛేజింగ్ స్కోరు 179 పరుగులుగా ఉంది. ఇదిలా ఉంటే పిచ్ పరిస్థితిని చూస్తే బ్యాటర్లు కీలకం కాబోతున్నారనేది అర్థమవుతోంది. ఐపీఎల్ లో అదరగొట్టిన భారత బ్యాటర్లు ఇక జూలు విదిలించే టైమొచ్చందని పలువురు అంచనా వేస్తున్నారు. సిరీస్ ను సమం చేయాలంటే ఈ మ్యాచ్ లో గెలుపు తప్పనిసరి. ఒకవేళ ఓడితే మాత్రం ఆతిథ్య ఇంగ్లాండ్ 2-0 ఆధిక్యంలో నిలిచి సిరీస్ విజయానికి మరింత చేరువవుతుంది.