పాక్ క్రికెటర్ కోసం కోట్లు… కావ్యా పాపపై ఫాన్స్ ఫైర్…!

సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ఫ్రాంఛైజీ సీఈవో, సహ యజమాని కావ్య మారన్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారారు. కావ్యా మారన్‌ నేతృత్వంలోని సన్‌ గ్రూప్‌ ఇటీవలే హండ్రెడ్‌ లీగ్‌లోని సన్‌రైజర్స్‌ లీడ్స్‌ ఫ్రాంచైజీలో మెజార్టీ శాతం వాటాను సొంతం

Post Published By: dialnews
Updated : 14 March 2026, 10:55 AM IST

సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ఫ్రాంఛైజీ సీఈవో, సహ యజమాని కావ్య మారన్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారారు. కావ్యా మారన్‌ నేతృత్వంలోని సన్‌ గ్రూప్‌ ఇటీవలే హండ్రెడ్‌ లీగ్‌లోని సన్‌రైజర్స్‌ లీడ్స్‌ ఫ్రాంచైజీలో మెజార్టీ శాతం వాటాను సొంతం చేసుకుంది. ఇక ఇంగ్లాండ్‌లో ది హండ్రెడ్‌ లీగ్‌ కోసం ఆటగాళ్ల వేలం నిర్వహించారు. ఇందులో సన్‌రైజర్స్ లీడ్స్‌ జట్టు పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.హండ్రెడ్‌ లీగ్‌ వేలంలో స్వయంగా పాల్గొన్న కావ్యా మారన్ .. అబ్రార్ అహ్మద్‌ను దక్కించుకునేందుకు ఇతర ఫ్రాంఛైజీలతో పోటీ పడ్డారు.

ఏకంగా రూ.2.34 కోట్లకు కొనుగోలు చేశారు. అబ్రార్ కోసం మరో ఫ్రాంచైజీ ట్రెంట్‌ రాకెట్స్ సన్‌రైజర్స్ లీడ్స్ పోటీ పడింది. అయితే అబ్రార్‌ను ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ.. సన్‌రైజర్స్ తీసుకోవడం పట్ల భారత అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా కావ్యా మారన్ తీరును ప్రశ్నిస్తున్నారు.ఇటీవలికాలంలో టీమిండియాతో ఆడిన మ్యాచ్‌లలో అబ్రార్ అహ్మద్‌ ఓవరాక్షన్‌ చేశాడు. ఓ సందర్భంలో భారత వన్డే కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ను ఔట్‌ చేసి.. అతి చేశాడు. డగౌట్ వైపు దారి చూపిస్తూ.. రెచ్చగొట్టాడు. ఇలాంటి వ్యక్తిని కావ్యా మారన్ తన జట్టులోకి తీసుకోవడం భారత ఫ్యాన్స్‌కు మింగుడుపడటం లేదు. ఈ విషయంపై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు.

నిజానికి పాకిస్థాన్ ప్లేయర్స్ ఎవరినీ కూడా ఐపీఎల్‌లోకి తీసుకోరు. అయితే ఈ రూల్ హండ్రెడ్ లీగ్స్ కు మాత్రం వర్తించదు. అందుకే కావ్యా మారన్.. అబ్రార్‌ను జట్టులోకి తీసుకున్నారు. దీంతో ప్రపంచ టీ20 లీగ్‌లలో పాక్ ప్లేయర్లను భారత ఫ్రాంఛైజీలు తీసుకోవనే వాదనకు తెరదించారు. కాగా అబ్రార్ అహ్మద్ పాకిస్థాన్ తరపున 46 టెస్టులు, 28 వన్డేలు, 52 టీ20లు ఆడాడు. ఇటీవల జరిగిన టీ20 ప్రపంచకప్ 2026లోనూ ఆడాడు. అతడికి పాకిస్థాన్‌, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్స్‌తో పాటు మేజర్ లీగ్ క్రికెట్ ఆడిన అనుభవం ఉంది. యూరప్‌లో టీ20 లీగ్‌లో ఆడటం అబ్రార్‌కు ఇదే మొదటిసారి.

Published : 
  • 14 March 2026, 10:55 AM IST