జిడ్డు బ్యాటింగ్.. చెత్త కెప్టెన్సీ హార్దిక్ పాండ్యాపై ఫ్యాన్స్ ఫైర్…!

ముంబై ఇండియన్స్‌కి చావో రేవో అన్న మ్యాచ్‌లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా నిర్ణయాలే ఇప్పుడు ఆ జట్టు ఓటమికి కారణమయ్యాయి. కెప్టెన్‌గా, బ్యాటర్‌గా రెండింటిలోనూ విఫలమై ఐపీఎల్ 2026 నుంచి ముంబై ఇంటిదారి పట్టడంలో ప్రధాన కారకుడయ్యాడు

Post Published By: dialnews
Updated : 4 May 2026, 8:50 PM IST

ముంబై ఇండియన్స్‌కి చావో రేవో అన్న మ్యాచ్‌లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా నిర్ణయాలే ఇప్పుడు ఆ జట్టు ఓటమికి కారణమయ్యాయి. కెప్టెన్‌గా, బ్యాటర్‌గా రెండింటిలోనూ విఫలమై ఐపీఎల్ 2026 నుంచి ముంబై ఇంటిదారి పట్టడంలో ప్రధాన కారకుడయ్యాడు. చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా నిర్ణయాలు మిస్ ఫైర్ అయ్యాయి. టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంటాడు అనుకున్న హార్దిక్ బ్యాటింగ్ ఎంచుకుని ఆశ్చర్యపరిచాడు. అక్కడి నుంచో పతనం మొదలైంది.హోం గ్రౌండ్‌లో సీఎస్కే బౌలర్లు ఆరంభంలో తడబడినా ఆ తర్వాత బ్యాక్ టు ఫామ్‌లోకి వచ్చి ఆఖరి పది ఓవర్లలో మ్యాచ్ తమ వైపు తిప్పుకున్నారు.

ఆరంభంలోనే వికెట్లు పడినా నమన్ ధీర్ కాస్త నిలబడటంతో మొదటి పది ఓవర్లలో 9కి పైగా రన్‌రేట్ సాధించారు. ఆఖరి పది ఓవర్లలో కూడా ఇదే ఫామ్ కొనసాగిస్తారు అనుకుంటే వరుస వికెట్లు కోల్పోయి కేవలం 159 దగ్గరే ఆగిపోయింది.తిలక్ వర్మ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా ఆఖరి ఓవర్ వరకూ క్రీజులోనే ఉన్నప్పటికీ స్కోర్ రాబట్టడంలో విఫలమయ్యాడు. తొలి పది ఓవర్లలో 90 పరుగులు చేసిన ముంబై ఇండియన్స్ జట్టు.. ఆఖరి పది ఓవర్లలో కేవలం 69 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇదే ముంబై ఇండియన్స్ ఓటమికి ప్రధాన కారణమైంది.హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్‌లో పూర్తిగా విఫలమయ్యాడు.

13వ ఓవర్‌లో క్రీజులోకి వచ్చిన పాండ్యా ఆ రేంజ్‌లో ప్రదర్శన చూపలేకపోయాడు. హార్దిక్ ఆఖరి ఓవర్ వరకూ క్రీజులో ఉన్నా భారీ స్కోర్ చేయడంలో ముంబై విఫలమైంది. సీఎస్కే బౌలర్ల ధాటికి హార్దిక్ పాండ్యా కనీసం బౌండరీలు కూడా రాబట్టలేకపోయాడు. 23 బంతులు ఆడిన హార్దిక్ పాండ్యా కేవలం 18 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు.ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ చాలా స్ట్రాంగ్ టీమ్‌తో కనిపించినా.. గ్రౌండ్‌లోకి వచ్చేసరికి తేలిపోయింది. బుమ్రా, బౌల్ట్, తిలక్, సూర్య, హార్దిక్, రోహిత్, రూధర్‌ఫోర్డ్ ఇలాంటి స్టార్ ప్లేయర్లు ఉన్నా కనీస ప్రదర్శన కూడా చేయలేకపోయింది. ముంబై ఇండియన్స్ తొమ్మిది మ్యాచ్‌లు ఆడి కేవలం రెండు మాత్రమే గెలిచింది. ప్లే ఆఫ్స్‌కి వెళ్లే అవకాశాలను కూడా పూర్తిగా కోల్పోయింది.

Published : 
  • 4 May 2026, 8:50 PM IST