ఐపీఎల్ 2026లో ఎంఎస్ ధోనీ కోసం చూసి చూసి ఫ్యాన్స్ అలసిపోయారు. ఈ సీజన్ ఆరంభం నుంచి ధోనీ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కానీ.. అదిగో ఇదిగో అంటూ అభిమానులకు ఆశ చూపి ఆఖరి నిమిషంలో హ్యాండ్ ఇస్తున్నాడు. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకూ ధోనీ కోసం ప్రతీ సీఎస్కే మ్యాచ్‌కి వచ్చి, నిరాశతో ఇంటికి వెళ్లడమే పరిపాటిగా మారింది.అయితే, క్రికెట్ వర్గాల సమాచారం ప్రకారం ఎంఎస్ ధోనీ ఈ సీజన్ ముగింపులో సీఎస్కే చెపాక్‌లో ఆడే ఆఖరి మ్యాచ్‌లో ఆడనున్నట్లు సమాచారం. చెన్నై సూపర్ కింగ్స్ తన చివరి లీగ్ మ్యాచ్‌ని మే 18న చెపాక్ స్టేడియంలో ఆడనుంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే ఈ మ్యాచ్‌లో ధోనీ కనిపించే అవకాశం ఉందని మాజీ క్రికెట్ మొహమ్మద్ కైఫ్ కూడా హింట్ ఇచ్చాడు. అతనితో పాటు రెవ్ స్పోర్ట్స్ కూడా ధోనీ ఫుల్ ఫిట్‌నెస్ సాధించినట్లు చెబుతోంది.సీజన్ ఆరంభానికి ముందు గాయం కారణంగా జట్టుకు దూరమైన ధోనీ.. ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడలేదు. ఇటీవల ఫిట్‌నెస్ సాధించి గ్రౌండ్‌లో ప్రాక్టీస్ చేసిన ధోనీ, మ్యాచ్ సమయానికి దూరమవుతున్నాడు.ఫ్యాన్స్ కూడా ధోనీ కోసం గ్రౌండ్‌కి వచ్చి నిరాశతో వెనుదిరగడం కామన్‌గా మారింది. ఫిట్‌నెస్ సాధించినప్పటికీ టీమ్ బాగుందని, ప్లేయింగ్ ఎలెవన్ లో మార్పులు చేయకూడదనే ఉద్దేశంతోనే తాను రావడం లేదనే వార్తలు కూడా వచ్చాయి.
చెపాక్‌లో జరిగే ఆఖరి మ్యాచ్‌లో అయినా ధోనీ ఆడుతాడో లేదో చూడాలి.ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ మంచి కమ్ బ్యాక్ ఇచ్చింది. వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడి పదో స్థానంలో ఉన్న సీఎస్కే.. ఇప్పుడు ఆఖరి ఏడు మ్యాచ్‌లలో ఐదు గెలిచి, పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి వచ్చింది. సీఎస్కే తన మిగతా నాలుగు మ్యాచ్‌లలో మూగు గెలిస్తే ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించనుంది. సీఎస్కే మే 10, మే 15న వరుసగా లక్నో సూపర్ జెయింట్స్‌తో రెండు మ్యాచ్‌లు ఆడనుండగా.. మే 18న చెపాక్‌లో సన్‌రైజర్స్‌తో, మే 21న గుజరాత్‌తో అహ్మదాబాద్‌లో చివరి మ్యాచ్ ఆడనుంది. ఈ నాలుగు మ్యాచ్‌లలో మూడు గెలిస్తే సీఎస్కే ప్లే ఆఫ్స్‌లో రాయల్‌గా అడుగుపెట్టే అవకాశం ఉంది.