ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించి.. సన్ రైజర్స్ హైదరాబాద్ పాయింట్స్ టేబుల్‌ను షేక్ చేసింది. ఈ టోర్నీలో వరుసగా నాలుగు మ్యాచులలో గెలిచిన ఆర్ఆర్కు తొలి ఓటమిని అందించింది. సోమవారం హైదరాబాద్‌లోని ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచులో 57 పరుగుల తేడాతో విజయం సాధించిన సన్ రైజర్స్.. రెండు పాయింట్లతో పాటు భారీగా నెట్రన్ రేట్‌ను సొంతం చేసుకుంది. ఈ మ్యాచులో ఓడినప్పటికీ రాజస్థాన్ మాత్రం పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానంలోనే కొనసాగుతోంది.రాజస్థాన్ రాయల్స్ ను చిత్తుగా ఓడించిన సన్ రైజర్స్.. పాయింట్స్ టేబుల్లో ఏడో స్థానం నుంచి నాలుగో ప్లేసులోకి దూసుకొచ్చింది.
ఐదు మ్యాచుల్లో రెండో విజయంతో నాలుగు పాయింట్లు ఖాతాలో వేసుకుంది. ప్లస్ 0.576 నెట్ రన్ రేట్ కలిగి ఉంది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్.. ఐదు మ్యాచులలో 4 విజయాలతో 8 పాయింట్లు, ప్లస్ 0.889 నెట్ రన్ రేట్‌తో అగ్రస్థానంలో నిలిచింది.4 మ్యాచులలో 3 విజయాలు సాధించిన పంజాబ్ కింగ్స్ రెండో ప్లేసులో ఉంది. కేకేఆర్‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో మరో పాయింట్ కూడా పంజాబ్ ఖాతాలో పడింది. మొత్తంగా ఏడు పాయింట్లు, ప్లస్ 0.720 నెట్ రన్‌రేట్‌తో పంజాబ్ రెండో స్థానంలో కొనసాగుతోంది.
ఆర్సీబీ నాలుగు మ్యాచులలో మూడు విజయాలతో మూడో ప్లేసులో ఉంది.ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఉన్నాయి. అయితే నెట్ రన్ రేట్లో మార్పుల కారణంగా ఈ జట్ల స్థానాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ముంబై ఇండియన్స్ , సీఎస్కే నాలుగు మ్యాచులలో ఒక్కో విజయంతో వరుసగా 8, 9వ ప్లేసులో ఉన్నాయి. ఆడిన నాలుగు మ్యాచులలో ఒక్క దాంట్లో కూడా గెలవలేకపోయిన కోల్‌కతా నైట్ రైడర్స్.. అట్టడుగు స్థానమైన పదో ప్లేసులో ఉంది. ఐపీఎల్లో లీగ్ స్టేజ్ మ్యాచులు ముగిసే సరికి టాప్-4 స్థానాల్లో ఉన్న జట్లు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తాయి.