ఒక కేప్టెన్ అలా.. ఒక కేప్టెన్ ఇలా…!

భారత్ మరోసారి ప్రపంచ క్రికెట్ పై తన జెండాను ఎగురవేసింది. టీ 20 వరల్డ్ కప్ 2026 ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసి భారత్ విశ్వవిజేతగా నిలిచింది.

Post Published By: dialnews
Updated : 10 March 2026, 2:01 PM IST

భారత్ మరోసారి ప్రపంచ క్రికెట్ పై తన జెండాను ఎగురవేసింది. టీ 20 వరల్డ్ కప్ 2026 ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసి భారత్ విశ్వవిజేతగా నిలిచింది. విజయం అనంతరం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చాలా ఎమోషనల్ అయ్యాడు.‌ 2024 వరల్డ్ కప్ తర్వాత జై షా మరియు రోహిత్ శర్మ తనపై నమ్మకం ఉంచి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారని గుర్తు చేసుకున్నాడు. బయటకు కనిపిస్తున్నంత ప్రశాంతంగా లోపల లేదు.. ప్రతి క్షణం చాలా టెన్షన్ పడ్డాను" అని నిజాయితీగా ఒప్పుకున్నాడు.

సీనియర్లు లేకపోయినా కుర్రాళ్లు బాధ్యతగా ఆడారని, ప్రతి ఒక్కరూ ఒక మ్యాచ్ విన్నర్‌లా రాణించారని కొనియాడాడు. ఈ విజయం కోట్ల మంది భారతీయుల సపోర్ట్ మరియు టీమ్ హార్డ్ వర్క్ వల్లనే సాధ్యమైందని సూర్య తెలిపాడు. మరోవైపు రన్నరప్‌గా నిలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ తమ ఓటమికి గల కారణాలను విశ్లేషించాడు. టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ తీసుకోవడమే తాము చేసిన అతిపెద్ద తప్పు అని శాంట్నర్ అంగీకరించాడు.

సొంత గడ్డపై భారత ఆటగాళ్లు ఒత్తిడికి లోనవుతారని భావించామని, కానీ వారు అసాధారణంగా ఆడారని ప్రశంసించాడు. ఓడిపోయినా సరే, ప్రపంచంలోనే అత్యుత్తమ జట్టుతో ఫైనల్ వరకు వచ్చి తలపడటం తమకు గర్వకారణమని ఆయన పేర్కొన్నాడు. ఈ టోర్నీ ఆద్యంతం భారత్ ఒక ఛాంపియన్‌లా ఆడింది. ముఖ్యంగా ఫైనల్‌లో సూర్య కెప్టెన్సీ మరియు బౌలర్ల ప్రదర్శన అమోఘం. కివీస్ బ్యాటర్లను కట్టడి చేయడంలో మన స్పిన్నర్లు కీలక పాత్ర పోషించారు. 2024 నుంచి మొదలైన ఈ ప్రయాణం 2026లో కప్పు గెలవడంతో ఒక మధురమైన ముగింపును ఇచ్చింది.

Published : 
  • 10 March 2026, 2:01 PM IST