భారత క్రికెట్ చరిత్రలో 'ది వాల్' అని పిలవబడే రాహుల్ ద్రవిడ్ పేరు వింటేనే ఒక క్రమశిక్షణ, పట్టుదల మరియు అంకితభావం గుర్తొస్తాయి. సాంకేతికంగా అత్యంత నైపుణ్యం కలిగిన బ్యాటర్లలో ద్రవిడ్ ఒకరు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా విదేశీ గడ్డపై, బంతి విపరీతంగా స్వింగ్ అయ్యే పిచ్‌లపై ద్రవిడ్ చూపించే సహనం అమోఘం. ఆసియా వెలుపల ఉన్న పిచ్‌లపై ఆడటం ఏ భారతీయ బ్యాటర్‌కైనా సవాలే. కానీ ద్రవిడ్, South Africa, England, New Zealand, Australia దేశాల్లో రెండు డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక భారతీయ ఆటగాడిగా ద్రవిడ్ రికార్డు సృష్టించాడు. ఆయన కెరీర్‌లో సాధించిన ఐదు డబుల్ సెంచరీలలో రెండు అత్యంత కీలకమైనవి 'సెన' దేశాల్లోనే రావడం విశేషం.
2002లో ఓవల్ మైదానంలో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ద్రవిడ్ 217 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడారు. దాదాపు పది గంటల పాటు క్రీజులో ఉండి ఇంగ్లీష్ బౌలర్లను విసిగించారు. ఈ ఇన్నింగ్స్ భారత్ ఆ మ్యాచ్‌ను డ్రా చేసుకోవడంలో కీలక పాత్ర పోషించింది. అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాపై ద్రవిడ్ చేసిన 233 పరుగులు భారత టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ ఇన్నింగ్స్‌లలో ఒకటిగా నిలిచిపోతుంది. ఆస్ట్రేలియా గడ్డపై భారత్ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేయడంలో ఈ డబుల్ సెంచరీనే పునాది వేసింది.
సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, వీరేంద్ర సెహ్వాగ్ వంటి దిగ్గజాలు భారత్ తరపున ఎన్నో డబుల్ సెంచరీలు సాధించినప్పటికీ, SENA దేశాల్లో రెండు లేదా అంతకంటే ఎక్కువ డబుల్ సెంచరీలు సాధించిన ఘనత మాత్రం ద్రవిడ్‌కే దక్కింది. ఆస్ట్రేలియా మరియు ఇంగ్లాండ్ వంటి కఠినమైన పరిస్థితుల్లో సుదీర్ఘ కాలం బ్యాటింగ్ చేయడం ద్రవిడ్ క్లాస్‌కు నిదర్శనం. కేవలం గణాంకాలు మాత్రమే ద్రవిడ్ గొప్పతనాన్ని చెప్పలేవు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజులో పాతుకుపోయి, వికెట్ల పతనాన్ని అడ్డుకోవడంలో ఆయనకు ఆయనే సాటి. అందుకే ఆయనను క్రికెట్ ప్రపంచం గౌరవంగా 'ది వాల్' అని పిలుచుకుంటుంది. నేటి తరం బ్యాటర్లకు ద్రవిడ్ ఆడిన ఈ ఇన్నింగ్స్‌లు ఒక పాఠ్యపుస్తకంలాంటివి.