కోహ్లీ @ 9000 దరిదాపుల్లో ఎవరూ లేరుగా…!

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే 9 వేల పరుగుల మైలురాయి అందుకున్న ఏకైక ఆటగాడిగా నిలిచాడు. కోహ్లీకి దరిదాపుల్లో మరే ఆటగాడు కూడా లేడు

Post Published By: dialnews
Updated : 29 April 2026, 3:00 PM IST

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే 9 వేల పరుగుల మైలురాయి అందుకున్న ఏకైక ఆటగాడిగా నిలిచాడు. కోహ్లీకి దరిదాపుల్లో మరే ఆటగాడు కూడా లేడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ ఈ ఫీట్ సాధించాడు. తన హోమ్ గ్రౌండ్‌లో కోహ్లీ ఈ అరుదైన ఘనతను అందుకోవడం ప్రత్యేకంగా నిలిచింది.ఈ మ్యాచ్‌కు ముందు ఈ మైలురాయికి 11 పరుగుల దూరంలో నిలిచిన కోహ్లీ.. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో సింగిల్ తీసి ఈ ఘనతను అందుకున్నాడు.

ఈ ఫీట్ సాధించేందుకు కోహ్లీ 6732 బాల్స్ ఆడాడు. ఆర్‌సీబీ ఫ్రాంచైజీ తరఫునే కోహ్లీ ఈ 9వేల పరుగులు చేసాడు.ఇప్పటికే ఐపీఎల్‌లో టాప్ రన్ స్కోరర్‌గా కోహ్లీ కొనసాగుతున్నాడు. అతని తర్వాత రోహిత్ శర్మ 7183 పరుగులతో రెండో స్థానంలో ఉండగా.. శిఖర్ ధావన్ 6769, డేవిడ్ వార్నర్ 6565, కేఎల్ రాహుల్ 5580 రన్స్ తో తదుపరి స్థానాల్లో కొనసాగుతున్నారు.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఆర్సీబీ 9 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసింది. 81 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించిన ఆర్సీబీ.. ఐపీఎల్ చరిత్రలోనే రెండో అతిపెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 16.3 ఓవర్లలో 75 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఆర్‌సీబీ 6.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 77 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది.

Published : 
  • 29 April 2026, 3:00 PM IST