క్రికెట్లో క్లాస్ ఈజ్ పర్మినెంట్ మాటకు మనీష్ పాండే కరెక్ట్‌గా స్యూట్ అవుతాడు. 2008 నుంచి ఇప్పటి వరకు ఐపీఎల్లో కొనసాగుతున్న అతికొద్ది మంది ప్లేయర్లలో మనీష్ పాండే ఒకడు. విరాట్ కోహ్లి సహచరుడు అయిన పాండే.. 2009లోనే ఆర్సీబీ తరఫున ఐపీఎల్ సెంచరీ చేసి సంచలనం సృష్టించాడు. అప్పటి నుంచి అదే ఫామ్ కొనసాగిస్తూ.. ఇప్పటికీ మ్యాచ్ విన్నింగ్ నాక్స్‌తో అదరగొడుతున్నాడు.ముంబై ఇండియన్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో మనీష్ పాండే తన క్లాస్ ఇన్నింగ్స్‌తో కేకేఆర్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఆరంభంలోనే వికెట్లు పడినా మిడిల్ ఓవర్లలో మ్యాచ్‌ని నిలబెట్టాడు. 33 బంతుల్లో ఆరు ఫోర్లతో 45 పరుగులు చేశాడు. హాఫ్ సెంచరీకి దగ్గరగా ఉన్న సమయంలో జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కీలక ఇన్నింగ్స్ ఆడినందుకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.2014 ఐపీఎల్ ఫైనల్ తర్వాత మనీష్ పాండే ఆడిన అద్భుత ఇన్నింగ్స్ కూడా ఇదే కావడం విశేషం. 2014 ఫైనల్లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫునే ఆడిన మనీష్ పాండే ఏడో స్థానంలో బ్యాటింగ్‌కి దిగి ఓడిపోయిందనుకున్న మ్యాచ్‌ని గెలిపించాడు. 50 బంతుల్లో ఏడు ఫోర్లు, 6 సిక్సర్లతో 94 పరుగులతో కేకేఆర్‌ను గెలిపించడమే కాకుండా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా సొంతం చేసుకున్నాడు.
2014 ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న మనీష్ పాండే.. మళ్లీ 12 ఏళ్ల తర్వాత అదే కేకేఆర్ జట్టులో ఉండి కీలక ఇన్నింగ్స్ ఆడి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సొంతం చేసుకున్నాడు. ఓవరాల్‌గా మనీష్ పాండేకి ఇది మూడో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు. 2009లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడిన సమయంలో సెంచరీ చేసి సంచలనం సృష్టించాడు. ఆ మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. అప్పటికి ఐపీఎల్లో తొలి సెంచరీ చేసిన ఆటగాడిగా కూడా మనీష్ పాండే నిలిచాడు.