Pv Sindhu: విజయ్ దేవరకొండ సినిమాలు నచ్చలేదా.. రౌడీ హీరోపై పీవీ సింధూ సంచలన వ్యాఖ్యలు

తనకు పాత, కొత్త సినిమాలనే తేడా ఏమీ ఉండదని, అన్నింటినీ చూస్తానని సింధూ చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది. ప్రభాస్‌ యాక్టింగ్‌ బాగుంటుందని, ఆయన సినిమాలు అన్నీ తాను తప్పకుండా చూస్తానని అన్నారు.

Post Published By: narender Thiru
Updated : 13 February 2024, 2:33 PM IST

Pv Sindhu: విజయ్‌ దేవరకొండ సినిమాలపై ప్రముఖ బ్యాట్మింటన్‌ స్టార్‌ పీవీ సింధూ ఆసక్తికరమైన కామెంట్స్‌ చేశారు. ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్య్వూలో మాట్లాడుతూ విజయ్‌ దేవరకొండ సినిమాల్లో కొన్ని తనకు నచ్చలేదంటూ చెప్పుకొచ్చారు. అయితే ఏ సినిమాలు నచ్చలేదనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. సినిమా హిట్‌ అవుతుందో, ప్లాప్‌ అవుతుందో తెలియకుండానే నటీనటులంతా చాలా కష్ట పడతారని, వారి కష్టాన్ని తక్కువ చేయడం సరికాదని అన్నారు.

Hari Rama Jogaiah: జనసేన లేకపోతే.. టీడీపీకి అంత సీన్ లేదు: హరిరామ జోగయ్య లెటర్

దీంతో ఈ కామెంట్స్‌ నెట్‌లో ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. తనకు పాత, కొత్త సినిమాలనే తేడా ఏమీ ఉండదని, అన్నింటినీ చూస్తానని సింధూ చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది. ప్రభాస్‌ యాక్టింగ్‌ బాగుంటుందని, ఆయన సినిమాలు అన్నీ తాను తప్పకుండా చూస్తానని అన్నారు. తనకు ప్రభాస్‌తో పాటు రామ్‌ చరణ్ యాక్టింగ్‌ అన్నా కూడా చాలా ఇష్టమని చెప్పారు. ఒలంపిక్స్‌లో మెడల్‌ గెలిచి వచ్చిన తర్వాత చిరంజీవి తనను ఇంటికి పిలిచి సత్కరించారని గుర్తు చేసుకున్నారు. అప్పుడు రామ్‌ చరణ్‌తో కలిసి మాట్లాడానని అన్నారు. అలాగే ఎన్‌టీఆర్‌ సినిమాలు, ఆయన యాక్టింగ్‌ కూడా బాగుంటాయని చెప్పారు.

మీ ఫేవరెట్‌ యాక్టర్‌ ఎవరు అని అడిగితే ఒక్కరి పేరు చెప్పడం కష్టం అంటూ చెప్పుకొచ్చారు. అయితే గతంలో సింధు సినిమాల్లోకి రాబోతున్నట్లు వార్తలు వచ్చాయి. వాటిని సింధు కొట్టి పడేశారు. తనకు యాక్టింగ్‌ చేయాలనే ఆలోచన ఎంత మాత్రమూ లేదని, బ్యాడ్మింటన్‌ పైనే పూర్తిగా ఫోకస్‌ చేస్తున్నానని చెప్పారు. అందువల్ల సినిమాల్లో న‌టించే టైమ్ త‌న‌కు లేద‌ని అన్నారు. భ‌విష్య‌త్తులో సినిమాల విష‌యంలో త‌న నిర్ణ‌యం ఎలా ఉంటుందో చెప్ప‌లేన‌న్నారు.
https://youtu.be/DhVHmoIsmbc

Published : 
  • 13 February 2024, 2:33 PM IST