పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన టీమిండియా సగర్వంగా సెమీస్‌లోకి అడుగుపెట్టింది. ఇక.. ఈ మ్యాచులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. సౌతాఫ్రికా పోరులో రెండు సిక్సర్లు కొట్టిన రోహిత్.. మిస్టర్ 360 డిగ్రీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ రికార్డును సమం చేశాడు.
