డేంజర్ లో సచిన్ రికార్డు… దూసుకొస్తున్న జో రూట్…!

ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ .. టెస్టుల్లో 14,000 పరుగుల మైలురాయిని చేరాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో రెండు పరుగులు చేయడం ద్వారా అతడు ఈ ఫీట్ సాధించాడు

Post Published By: dialnews
Updated : 23 June 2026, 7:44 PM IST

ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ .. టెస్టుల్లో 14,000 పరుగుల మైలురాయిని చేరాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో రెండు పరుగులు చేయడం ద్వారా అతడు ఈ ఫీట్ సాధించాడు. దీంతో టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఈ ఫీట్ సాధించిన రెండో క్రికెటర్‌గా అతడు నిలిచాడు. ఈ క్రమంలోనే టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక రన్స్ చేసిన వ్యక్తిగా ఉన్న సచిన్‌ టెండూల్కర్‌ రికార్డుకు రూట్ చేరువయ్యాడు. సుమారుగా మరో 1800 రన్స్ చేస్తే.. రెడ్ బాల్ క్రికెట్‌లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్‌గా రూట్ అవతరిస్తాడు.ప్రస్తుతం రూట్ ఉన్న సూపర్ ఫామ్ చూస్తుంటే రాబోయే రెండు మూడేళ్లలోనే ఈ రికార్డు బద్దలవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్‌ల జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉన్నాడు. అతడు తన టెస్ట్ కెరీర్‌లో 15,921 పరుగులు సాధించాడు. సచిన్ 2010లో ఈ ఫీట్ సాధించాడు. అయితే ఈ రికార్డు ఎప్పటికీ చెరిగిపోదని అంతా భావించారు. టెస్ట్ క్రికెట్‌కు ఆసక్తి తగ్గుతున్న ప్రస్తుత రోజుల్లో సచిన్ రికార్డు చెక్కు చెదరకుండా ఉంటుందనే విశ్లేషణలు వినిపించాయి. కానీ రెడ్ బాల్ క్రికెట్ అంటే ఆసక్తిచూపించే ఇంగ్లాండ్‌లో పుట్టిన జో రూట్.. ఈ ఫార్మాట్‌కు ప్రాణం పోస్తున్నాడు.

పరుగుల వరద పారిస్తూ.. సచిన్ రికార్డును డేంజర్‌లో పెట్టాడు. 35 ఏళ్ల జో రూట్.. సచిన్ రికార్డు బద్దలు కొట్టేందుకు 1921 పరుగుల దూరంలో ఉన్నాడు.విరాట్ కోహ్లీ తన టెస్ట్ కెరీర్‌లో 9230 పరుగులు సాధించాడు. కేన్ విలియమ్సన్ 9515 పరుగులు స్కోరు చేశాడు.పరుగుల పరంగానే కాకుండా సెంచరీల విషయంలో కూడా జో రూట్ సరికొత్త రికార్డుల వేటలో ఉన్నాడు. ఈ ఫార్మాట్‌లో సచిన్ టెండూల్కర్ 51 సెంచరీలతో మొదటి స్థానంలో ఉండగా.. జో రూట్ ప్రస్తుతం 41 సెంచరీలతో సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాడు. రూట్ ఈ మ్యాచ్ తో ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్ 41 సెంచరీలు రికార్డును సమం చేశాడు. ఆయన కంటే ముందు జాక్ కలిస్ (45 సెంచరీలు, సచిన్ ఉన్నారు. సచిన్ సెంచరీల రికార్డును అందుకోవడానికి రూట్ కు ఇంకా 10 శతకాలు కావాలి.

Published : 
  • 23 June 2026, 7:44 PM IST