Sanju Samson: భారత జట్టు ప్రాక్టీస్‌పై సంజు శాంసన్ ట్వీట్.. నెటిజన్లు ఫిదా..!

తాజాగా సంజూ శాంసన్‌ చేసిన ఓ ఇన్‌స్టా పోస్టు వైరల్‌గా మారింది. అందులోని వ్యాఖ్యను చూశాక చాలామంది అతడిని అభినందిస్తున్నారు. అతడి సమయస్ఫూర్తికి మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో భాగంగా భారత జట్టు తిరువనంతపురం వెళ్లింది.

Post Published By: narender Thiru
Updated : 4 October 2023, 4:11 PM IST

Sanju Samson: యువ క్రికెటర్‌ సంజూ శాంసన్‌ ఏం చేసినా ఇంటర్నెట్లో వైరల్‌ అవుతుంది. అతడిని టీమ్‌ ఇండియాకి తీసుకుంటే గొప్పగా ఆడాలని అభిమానులు ట్వీట్లు చేస్తుంటారు. ఒకవేళ అతడిని పక్కన పెడితే సోషల్‌ మీడియా ఫైర్‌ అవుతుంది. మిగతా క్రికెటర్లతో అతడి గణాంకాలను పోలుస్తూ విమర్శలు వెల్లువెత్తుతాయి. ఏం జరిగినా అతడు మాత్రం భారత జట్టు యాజమాన్యం, బీసీసీఐ సెలక్టర్లపై వేలెత్తి చూపించడు. వీలైనంత వరకు హుందాగా ప్రవర్తిస్తుంటాడు.

తాజాగా సంజూ శాంసన్‌ చేసిన ఓ ఇన్‌స్టా పోస్టు వైరల్‌గా మారింది. అందులోని వ్యాఖ్యను చూశాక చాలామంది అతడిని అభినందిస్తున్నారు. అతడి సమయస్ఫూర్తికి మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో భాగంగా భారత జట్టు తిరువనంతపురం వెళ్లింది. అక్కడి స్టేడియంలో నెదర్లాండ్స్‌తో మంగళవారం వార్మప్‌ మ్యాచ్‌కు సిద్ధమైంది. ఎడతెరపి లేకుండా వర్షం కురవడంతో ఈ మ్యాచ్ టాస్‌ పడకుండానే రద్దు చేశారు. ఈ సన్నాహక మ్యాచుకు ముందు టీమ్‌ ఇండియా నెట్స్‌లో సాధన చేసింది. ఇదే సమయంలో అక్కడి గోడకు సంజూ శాంసన్‌ నిలువెత్తు చిత్రపటం కనిపించింది.

దాని ముందే భారత క్రికెటర్లు సాధన చేశారు. ఈ చిత్రాన్ని సంజూ ఇన్‌స్టాలో పంచుకున్నాడు. 'దేవభూమిలో టీమ్‌ఇండియాతో నేను' అనే కాప్షన్‌ పెట్టాడు. ఈ నేపథ్యంలో భారత జట్టుకు మంచి జరగాలని, కప్‌ గెలవాలని కోరుకుంటూ కేరళ క్రికెట్ సంఘం క్రికెటర్లతో కేక్‌ కట్‌ చేయించింది. వారికి శుభాకాంక్షలు తెలిపింది.

Published : 
  • 4 October 2023, 4:11 PM IST