టీ20 వరల్డ్‌కప్ విన్నర్ సూర్యకుమార్ యాదవ్‌ను టీమిండియా కెప్టెన్సీ నుంచి తొలగించేందుకు అంతా సిద్ధమైంది. అతని స్థానంలో శ్రేయాస్ అయ్యర్‌కు సెలెక్టర్లు అవకాశం ఇవ్వడం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2026 ముగిసిన వెంటనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఐర్లాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌తో శ్రేయాస సార్థయ బాధ్యతలు మొదలుకానున్నట్టు సమాచారం. రోహిత్ శర్మ లెగసీతో టీమిండియాను వరుసగా రెండోసారి టీ20 వరల్డ్‌కప్ ఛాంపియన్‌గా నిలిపిన సూర్యకుమార్ యాదవ్ ను కెప్టెన్సీపై ఎప్పటి నుంచో చర్చలు జరగుతున్నాయి. టీ20 వరల్డ్‌కప్ ముందు నుంచే సూర్యకు ఇదే చివరి టోర్నీ అని అందరూ అనుకున్నారు. కానీ, తన లక్ష్యం ఒలింపిక్స్ అంటూ సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు. కానీ.. అప్పటి వరకు సూర్యనే కెప్టెన్‌గా కొనసాగుతాడా లేదా అని అప్పట్లో చాలా ప్రశ్నలు వచ్చాయి.
ఆ అనుమానాలన్నింటికీ బీసీసీఐ ఐపీఎల్ 2026 తర్వాత ఫుల్స్టాప్ పెట్టనుంది. ఐపీఎల్ 2026 ముగిసిన తర్వాత టీమిండియాకు చాలా బిజీ షెడ్యూల్ ఉంది. అప్ఘనిస్థాన్‌తో టెస్టు, వన్డే సిరీస్.. ఆ వెంటనే ఇంగ్లండ్ పయనం.. మధ్యలో ఐర్లాండ్ టూర్ ఉంది. దాంతో బీసీసీఐ ఇప్పటి నుంచే కసరత్తులు మొదలుపెట్టింది. ముఖ్యంగా టీ20 టీమ్‌పై దృష్టి పెట్టి నూతన కెప్టెన్‌ను ప్రకటించే ఆలోచనలో ఉంది.ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ 2028, అదే సంవత్సరంలో లాజ్ ఏంజిల్స్‌లో ఒలింపిక్స్ ఉండటంతో నాయకత్వ మార్పుపై బీసీసీఐ దృష్టిసారించింది. 2024లో శ్రేయాస్ అయ్యర్ తాను కెప్టెన్సీ చేసిన అన్ని జట్లను ఫైనల్‌కి తీసుకెళ్లి విజేతగా నిలిపాడు. ఐపీఎల్ 2024లో కేకేఆర్‌ను ఛాంపియన్‌గా చేయడంతో పాటు, ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్‌ను ఫైనల్‌కు చేర్చడంలో అయ్యర్ పాత్ర కీలకం. అంతేకాకుండా బ్యాటింగ్‌లోనూ అద్భుతంగా రాణిస్తూ సెలెక్టర్లకు సవాళ్లు విసిరాడు.
అదే సమయంలో కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత సూర్యకుమార్ యాదవ్ పెద్దగా రాణించలేకపోయాడు. అంతకుముందు వరుస సెంచరీలతో పాటు టీ20 బ్యాటర్ ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్‌లో కొనసాగిన సూర్య.. కెప్టెన్సీ తర్వాత విఫలమయ్యాడు. టీ20 వరల్డ్‌కప్‌లో కూడా యూఎస్ఏ మీదే చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ కారణాలు అన్నింటితో 35 సంవత్సరాల సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించాలన్న ఆలోచనలో బీసీసీఐ ఉంది.సూర్యను కెప్టెన్సీ నుంచి తొలగించిన తర్వాత జట్టులో కొనసాగిస్తారా లేదా అన్నది క్లారిటీ లేదు. ఐపీఎల్ 2026లో కూడా సూర్య చెప్పుకోదగ్గ స్థాయిలో ఆడలేదు. అవకాశాలు వచ్చినా భారీ స్కోర్స్ చేయడంలో విఫలమవతూనే వస్తున్నాడు. దీంతో ప్లేయర్ గా కూడా సూర్యకు చోటు గ్యారెంటీ లేనట్టేనని భావిస్తున్నారు.