రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ చరిత్ర సృష్టించాడు. 19 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే 200 మ్యాచ్‌లు ఆడిన తొలి స్పెషలిస్ట్ పేసర్‌గా నిలిచాడు. ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో భువనేశ్వర్ కుమార్ ఈ ఫీట్ సాధించాడు. ఇది భువనేశ్వర్ కుమార్ 200వ ఐపీఎల్ మ్యాచ్. 36 ఏళ్ల భువనేశ్వర్ కుమార్ ఈ 200 మ్యాచ్‌ల్లో 215 వికెట్లు పడగొట్టాడు.ఐపీఎల్ 2011 సీజన్లో పుణే వారియర్స్ ఇండియా జట్టు తరఫున అరంగేట్రం చేసిన భువనేశ్వర్ కుమార్ 2013 వరకు ఆ జట్టులోనే కొనసాగాడు. ఐపీఎల్ 2014 నుంచి 2024 వరకు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించాడు.
10 ఏళ్ల ప్రయాణం అనంతరం భువనేశ్వర్‌ను సన్‌రైజర్స్ వదిలేయాగా.. ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఆర్సీబీ కొనుగోలు చేసింది.అప్పట్లో ఈ నిర్ణయాన్ని అందరూ తప్పుబట్టారు. కానీ అతను గత సీజన్‌తో పాటు ఈ సీజన్లో ఆర్సీబీ తరఫున దుమ్మురేపుతున్నాడు. 200 మ్యాచ్‌లు ఆడిన తొల స్పెషలిస్ట్ పేసర్‌గా.. పేస్ ఆల్‌రౌండర్‌గా రికార్డ్ సాధించిన భువనేశ్వర్ కుమార్ ఓవరాల్‌గా ఈ ఫీట్ సాధించిన 12వ ఆటగాడిగా నిలిచాడు.ఐపీఎల్లో 200 మ్యాచ్‌ల మైలురాయి అందుకున్న మూడో బౌలర్‌గా కూడా భువనేశ్వర్ కుమార్ రికార్డ్ సాధించాడు. రవిచంద్రన్ అశ్విన్ 221, రవీంద్ర జడేజా 264 మ్యాచ్ లతో భువనేశ్వర్ కుమార్ కంటే ముందున్నారు.
ఐపీఎల్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన జాబితాలో మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టాప్-3లో కొనసాగుతుండగా.. దినేశ్ కార్తీక్, శిఖర్ ధావన్, అజింక్యా రహానే, సురేశ్ రైనా రాబిన్ ఊతప్ప, అంబటి రాయుడు 200 పైగా మ్యాచ్ లు ఆడిన జాబితాలో ఉన్నారు. ఇదిలా ఉంటే ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో యుజ్వేంద్ర చాహల్ 229 వికెట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. భువనేశ్వర్ కుమార్ , సునీల్ నరైన్ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. ఫాస్ట్ బౌలర్ల జాబితాలో భువీ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. జస్ప్రీత్ బుమ్రా, డ్వేన్ బ్రావో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.