ఆ టాలీవుడ్ హీరో నా ఫేవరెట్ రైనా కామెంట్స్ వైరల్

భారత క్రికెట్ లో చురుకైన ఫీల్డర్ గా, హిట్టర్ గా సురేష్ రైనా అభిమానులకు పరిచయమే.. రిటైర్మెంట్ తర్వాత కొన్ని లీగ్స్ ఆడుతున్న రైనా తన పర్సనల్ లైఫ్ గురించి తాజాగా ఓ ఇంటర్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

Post Published By: Vencateshg
Updated : 4 September 2024, 4:10 PM IST

భారత క్రికెట్ లో చురుకైన ఫీల్డర్ గా, హిట్టర్ గా సురేష్ రైనా అభిమానులకు పరిచయమే.. రిటైర్మెంట్ తర్వాత కొన్ని లీగ్స్ ఆడుతున్న రైనా తన పర్సనల్ లైఫ్ గురించి తాజాగా ఓ ఇంటర్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. తన ఫేవరెట్‌ హీరో ఎవరు అని యాంకర్‌ అడగ్గా ఆసక్తికరంగా సమాధానమిచ్చారు. సౌత్‌ హీరోల్లో సూర్య అంటే ఇష్టమని , తెలుగులో గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ తన ఫేవరెట్‌ అని చెప్పాడు. చరణ్‌ చాలా డిఫరెంట్ యాక్టర్ అని రైనా చెప్పుకొచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన చరణ్‌ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ వీడియోను విపరీతంగా ట్రెండ్‌ చేస్తున్నారు.

Published : 
  • 4 September 2024, 4:10 PM IST