భారతీయ సినీ అభిమానులకు ఇప్పుడు ఒకే ఒక్క వార్త విపరీతమైన ఆసక్తిని కలిగిస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, వరుస హిట్లతో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న తమిళ దర్శకుడు అట్లీ కాంబినేషన్లో ఒక బిగ్ బడ్జెట్ సినిమా రాబోతోందనే సంగతి మనందరికీ తెలిసిందే. అదే రాకా. అయితే ఈ సినిమా గురించి రోజురోజుకూ వస్తున్న లీకులు, రూమర్లు సినీ ప్రియులకు నిద్రలేకుండా చేస్తున్నాయి.ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ డిజైన్ గురించి నెట్టింట ప్రచారం జరిగింది. అందులో అల్లు అర్జున్ గుండుతో కనిపించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతటితో ఆగకుండా, ఆయన ముఖంపై ఒక తోడేలు పంజా కప్పి ఉన్నట్లు ఆ పిక్చర్ డిజైన్ ఉందట.
సాధారణంగా మనం చూసే కమర్షియల్ యాక్షన్ సినిమాలా ఇది ఉండదని, అట్లీ దీనిని ఒక భిన్నమైన సైన్స్ ఫిక్షన్ నేపధ్యంలో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. సోర్స్ ప్రకారమైతే టైమ్ ట్రావెల్ లేదా మైథాలజీని సైన్స్ ఫిక్షన్ కు జోడించి ఈ భారీ విజువల్ వండర్‌ను మన ముందుకు తీసుకురాబోతున్నారు.ఈ సినిమా రేంజ్‌ను ఎక్కడికో తీసుకెళ్లే అసలైన సంచలనం ఏమిటంటే.. ఇందులో మెయిన్ విలన్ పాత్ర కోసం ఏకంగా హాలీవుడ్ ఆస్కార్ విన్నర్, 'మెన్ ఇన్ బ్లాక్', 'ది పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్' లాంటి చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న విల్ స్మిత్‌ను సంప్రదించారట! ఇది నిన్న కాక మొన్న అనుకున్నది కాదట. అట్లీ టీమ్ గత ఏడాది కాలంగా విల్ స్మిత్‌తో చర్చలు జరుపుతోందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
అల్లు అర్జున్ పాత్రకు పోటీగా నిలిచే ఒక అంతర్జాతీయ స్థాయి పవర్ ఫుల్ విలన్ రోల్ కోసమే విల్ స్మిత్‌ను ఎంచుకున్నారని టాక్. ఈ హాలీవుడ్ నటుడి సన్నివేశాలన్నింటినీ విదేశాల్లోనే షూట్ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. విల్ స్మిత్ ఇచ్చే ఖాళీ డేట్లను బట్టి ఏ దేశంలో షూటింగ్ జరపాలనేది త్వరలోనే డిసైడ్ చేస్తారట. అంతేకాదు, ఈ సినిమా కోసం విల్ స్మిత్ వేసుకోబోయే ప్రత్యేక కాస్ట్యూమ్స్ కూడా ఇప్పటికే డిజైన్ చేసి సిద్ధంగా ఉంచారని సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది సెప్టెంబర్ తర్వాత విదేశీ షెడ్యూల్స్ మొదలయ్యే అవకాశముంది. అయితే, ఈ విల్ స్మిత్ ఎంట్రీపై మేకర్స్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కేవలం లీక్‌లు, మీడియా కథనాల ద్వారానే ఈ వార్త బాగా వైరల్ అవుతోంది. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం, మన సౌత్ సినిమా స్థాయి హాలీవుడ్ దాకా వెళ్లడం ఖాయం! బన్నీ వర్సెస్ విల్ స్మిత్ కాంబినేషన్‌ను వెండితెరపై చూడటానికి అభిమానులంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.