ఇండియన్ ప్రీమియర్ లీగ్ లక్నో సూపర్ జెయింట్స్ వరుస పరాజయాలతో సతమతమవుతోంది. ఆడిన 6 మ్యాచ్‌ల్లో 4 ఓటములు.. 2 విజయాలతో పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది. నెట్ రన్ రేట్ -1.173కి పడిపోయింది. చూస్తుంటే లక్నోకు ఈ సీజన్ మరో పీడకలగా మారే అవకాశం ఉంది. ఫ్రాంచైజీ ఓనర్ సంజీవ్ గోయెంకా తీరుతో విసుగెత్తిన రాహుల్ గత సీజన్ కు ముందే లక్నోను వీడి వేలంలోకి వెళ్లగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. ఇక మెగా వేలంలో రూ. 27 కోట్లకు రిషభ్ పంత్‌ను లక్నో సొంతం చేసుకుంది. గత సీజన్లో అతడు పేలవ ప్రదర్శన చేశాడు. ఈ సీజన్లో కూడా పెద్దగా ఆడటం లేదు.
ఇక రూ. 21 కోట్లకు రీటెయిన్ చేసుకున్న నికోలస్ పూరన్.. ఈ సీజన్లో పరమ చెత్త ప్రదర్శన చేస్తున్నాడు. ఒక్క మ్యాచ్‌లో కూడా రాణించలేదు. 6 మ్యాచ్‌ల్లో 51 పరుగులు చేశాడు. సగటు 8.50. స్ట్రయిక్ రేట్ 79.69. టెస్టులు ఆడుతున్నట్లు ఆడుతున్నాడు.పంజాబ్ కింగ్స్‌తో జరిగిన పోరులో అందరూ 150కు పైగా స్ట్రయిక్ రేట్‌తో బ్యాటింగ్ చేస్తుంటే పూరన్ మాత్రం 9 బంతుల్లో 9 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో ఒక్కసారి కూడా 100కు పైగా స్ట్రయిక్ రేట్‌తో బ్యాటింగ్ చేయలేదు.
లక్నో అభిమానులు నికోలస్ పూరన్‌ను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. లక్నోకు పట్టిన సగం దరిద్రం నువ్వే అంటూ కామెంట్స్ చేస్తున్నాడు. కేఎల్ రాహుల్‌ను అవమానించడం కాదు.. పూరన్‌పై యాక్షన్ తీసుకో అంటూ లక్నో ఓనర్ సంజీవ్ గొయెంకాను ఏకిపారేస్తున్నారు. రాబోయే మ్యాచ్‌ల్లో పూరన్‌ను పక్కన పెట్టి వేరే వాళ్లకు అవకాశం ఇవ్వాలంటూ కోరుతున్నారు. పూరన్ వల్ల రూపాయి లాభం లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. పూరన్ 2023లో సన్ రైజర్స్ తరఫున ఆడాడు. అనంతరం హైదరాబాద్ అతడిని వదిలేసింది. 2024, 2025 సీజన్లలో లక్నో తరఫున పూరన్ అద్భుతంగా ఆడాడు. 2025 ఐపీఎల్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై పలికిన పూరన్.. లీగ్స్ మాత్రమే ఆడుతున్నాడు. దాంతో అతడి బ్యాటింగ్ లయ తప్పింది.