నేను వేలు పెట్టని సినిమా..!

భద్రకాళి పిక్చర్స్ బేనర్‌పై సుమంత్ ప్రభాస్ మరియు అనంతిక సనిల్ కుమార్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం "రోమాంచకం". ఈ సినిమాను ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తుండగా, దీనికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.

Post Published By: dialnews
Updated : 1 September 2026, 4:05 PM IST

భద్రకాళి పిక్చర్స్ బేనర్‌పై సుమంత్ ప్రభాస్ మరియు అనంతిక సనిల్ కుమార్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం "రోమాంచకం".
ఈ సినిమాను ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తుండగా, దీనికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి రౌడీ హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు.ఈ వేడుకలో ప్రముఖ దర్శకుడు, నిర్మాత సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ సినిమా విశేషాలను ప్రేక్షకులతో పంచుకున్నారు.దర్శకుడు వేణుగోపాల్ తనకు ఈ కథ చెప్పినప్పుడు తాను బాగా నవ్వుకున్నానని ఆయన తెలిపారు. అయితే కథ చెప్పినంత బాగా సినిమా తీయగలవా అని తాను అడగగా, ఆయన ఆరు నిమిషాల సీన్ చూపించి ఆశ్చర్యపరిచారన్నారు.

అప్పటి నుంచే వేణుపై నమ్మకంతో ఈ సినిమా బాధ్యతలు అప్పగించామని సందీప్ రెడ్డి వంగా వెల్లడించారు.
ఈ చిత్రంలో హీరో సుమంత్ ప్రభాస్ ఎలాంటి గర్వం లేకుండా అందరితో కలిసిపోయి చాలా చక్కగా నటించాడని కొనియాడారు.
అలాగే హీరోయిన్ అనంతిక నటన కూడా చాలా బాగుందని, ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ చేసిన అందరూ అద్భుతంగా నటించారని ప్రశంసించారు.
ఈ చిత్రానికి సంగీతం అందించిన వాసుపై నమ్మకం ఉంచామని, ఆ పాటలు విన్న తర్వాత ఆ నమ్మకం నిజమైందనిపించిందని ఆయన తెలిపారు. ఈ సినిమా సెప్టెంబర్ 3న గ్రాండ్‌గా విడుదల కానుండగా, సెప్టెంబర్ 2నే ప్రత్యేకంగా ప్రీమియర్స్ వేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
దర్శకుడు వేణుగోపాల్ కల నిజమయ్యే రోజు సెప్టెంబర్ 3 అని, ఆ తర్వాత ఎన్ని సినిమాలు చేసినా ఆ రోజు ప్రత్యేకంగా నిలుస్తుందని అన్నారు.

హీరో విజయ్ మాట్లాడుతూ.. అర్జున్ రెడ్డి' రిలీజైన ఆగస్టు 24 ఎంత గుర్తుందో, ఈ రోజు కూడా ఈ టీమ్‌కు అలానే గుర్తుండిపోవాలని ఆకాంక్షించారు.
ఈ సినిమా కోసం టీమ్ అందరూ చాలా కష్టపడ్డారని, థియేటర్లో ప్రేక్షకులు అందరూ గట్టిగా నవ్వుకుంటారని తెలిపారు.
ఈ సినిమా కోసం ప్రేక్షకులు పెట్టే ప్రతీ రూపాయికి, సమయానికి తగిన వినోదం దొరుకుతుందని చెప్పారు.
నిర్మాత ప్రణయ్ రెడ్డి మాట్లాడుతూ.. అంత పెద్ద స్టార్ హీరో అయిన విజయ్ దేవరకొండ కూడా తనను చూడగానే లేచి నిలబడతాడని, ఆయనొక మంచి మనిసంటూ ప్రశంసలు కురిపించారు.ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త విజయం నమోదు కావాలని చిత్ర బృందం ఆశిస్తోంది.
ప్రేక్షకులకు ఈ చిత్రం ఒక చక్కటి థియేట్రికల్ అనుభూతిని పంచుతుందని యూనిట్ బలంగా నమ్ముతోంది.

Published : 
  • 1 September 2026, 4:05 PM IST