మెగాస్టార్ చిరంజీవి మరియు డైరెక్టర్ బాబీ కొల్లి కలయికలో రాబోతున్న కొత్త సినిమాపై ప్రస్తుతం టాలీవుడ్లో జోరుగా చర్చ సాగుతోంది. చిరంజీవి కెరీర్లో 158వ చిత్రంగా తెరకెక్కుతున్న కాకా సినిమా అప్డేట్స్ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.తాజాగా ఈ మూవీలో మెగాస్టార్ పాత్రలకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది.
ఈ చిత్రంలో చిరు రెండు భిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారని, అందులో ఒక పాత్ర లుక్ చాలా యంగ్‌గా ఉంటూ మునుపెన్నడూ చూడని విధంగా ఉంటుందని సమాచారం. ఇక మరో పాత్ర విషయానికి వస్తే, అది మెగాస్టార్ రెగ్యులర్ లుక్‌లోనే ఉంటుందని తెలుస్తోంది.
ఈ పాత్రల్లో చాలా వేరియేషన్స్ ఉంటాయని, ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా ఈ కథ నడుస్తుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. చిరును పూర్తిగా కొత్త కోణంలో చూపించాలనే ఉద్దేశంతోనే డైరెక్టర్ బాబీ ఈ ప్రత్యేకమైన కథను సిద్ధం చేశారు. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాతలు వెంకట్ కే నారాయణ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.