ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎవరూ ఊహించని ఒక మైండ్ బ్లోయింగ్ పొలిటికల్ డ్రామా క్లైమాక్స్‌కు చేరింది. వైఎస్ఆర్సీపీలో ఒకప్పుడు నంబర్ టూ స్థానంలో ఉండి, చక్రం తిప్పిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి.. ఇప్పుడు నేరుగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోటపైనే తిరుగుబాటు జెండా ఎగరవేయబోతున్నారా..? అవుననే అంటున్నాయి లేటెస్ట్ పొలిటికల్ ఈక్వేషన్స్. ఈ నెల 7వ తేదీ సోమవారం మధ్యాహ్నం 1:15 గంటలకు విజయవాడ 'లెమన్ ట్రీ ప్రీమియర్' హోటల్లో ఆయన నిర్వహించబోయే ప్రెస్ మీట్.. ఏపీ పాలిటిక్స్ మొత్తాన్ని షేక్ చేయబోతోంది. ఎందుకంటే, ఆయన పాత పార్టీలోకి వెళ్లే ప్రసక్తే లేదని తేల్చేస్తూ సొంతంగా కొత్త రాజకీయ పార్టీని అనౌన్స్ చేయబోతున్నారు. మరి ఈ పార్టీ వెనుక ఉన్న శక్తులు ఎవరు..? జగన్‌ను దెబ్బకొట్టేందుకు సాయిరెడ్డి వేసిన స్కెచ్ ఏంటి..?
గత కొన్ని నెలలుగా విజయసాయిరెడ్డి మళ్లీ వైఎస్ఆర్సీపీ లోకి రీఎంట్రీ ఇస్తారంటూ సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరిగాయి. కానీ ఆ వార్తలకు సాయిరెడ్డి తన ట్విట్టర్ వేదికగా పక్కా క్లారిటీతో ఎండ్ కార్డ్ వేశారు. తాను ఏ పాత పార్టీ వైపు అడుగులు వేయడం లేదని.. కేవలం ప్రజల ప్రయోజనాలే పరమావధిగా సరికొత్త ‘ప్రత్యామ్నాయ రాజకీయ విధానం’ తో సరికొత్త ప్రాంతీయ పార్టీని స్థాపించబోతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుత ఏపీలో ఉన్న టూ-పార్టీ మోడల్, అంటే కేవలం రెండు పార్టీల చుట్టూ తిరిగే రాజకీయాలు సామాన్య మానవుడి ఆశయాలను, ప్రయోజనాలను పూర్తిగా దెబ్బతీస్తున్నాయని, అందుకే ప్రజల పక్షాన పోరాడేందుకు థర్డ్ ఫోర్స్‌గా తాను వస్తున్నట్లు సాయిరెడ్డి కుండబద్దలు కొట్టారు.
మరి సెప్టెంబర్ 7న జరగబోయే ప్రెస్ మీట్లో విజయసాయిరెడ్డి ఎవరిని ప్రధానంగా టార్గెట్ చేయబోతున్నారు..? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది బాసు. ఆయన మెయిన్ టార్గెట్ మరెవరో కాదు.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరియు వైఎస్ఆర్సీపీ అగ్ర నాయకత్వమే. ఈ విషయాన్ని ఆయన ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశాల్లో స్పష్టం చేస్తూ వచ్చారు. పార్టీని వీడిన తర్వాత సాయిరెడ్డి రాసిన ఒక లేఖ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. జగన్ చుట్టూ ఉన్న కోటరీ, ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి నేతల ఒంటెద్దు పోకడల వల్లే సీనియర్ నేతలైన బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి లాంటి వాళ్లు ఊపిరాడక ఇబ్బంది పడుతున్నారని, తన ఆత్మగౌరవాన్ని చంపుకోలేకే తాను పార్టీకి రాజీనామా చేశానని సాయిరెడ్డి ఓపెన్ అయ్యారు. ఈ ప్రెస్ మీట్లో వైఎస్ఆర్సీపీ అంతర్గత వైఫల్యాలను, కోవర్టు పాలిటిక్స్‌ను పక్కా ఆధారాలతో సాయిరెడ్డి బయటపెట్టబోతున్నట్లు తెలుస్తోంది.
మరి.. విజయసాయిరెడ్డి పెట్టబోయే కొత్త పార్టీ జెండా.. ఎజెండా ఏంటి..? సాయిరెడ్డి మాటల్లోనే చెప్పాలంటే.. ఇది "ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల పక్షాన" నిలబడే పార్టీ. చట్టసభల్లో, ముఖ్యంగా అసెంబ్లీ మరియు పార్లమెంట్లో సామాన్యుడి గొంతుకను లాయర్లా బలంగా వినిపించడమే ఈ పార్టీ ప్రధాన ఎజెండా. మరి పార్టీ ఎప్పుడు ప్రకటిస్తారు..? అంతర్గత సమాచారం ప్రకారం.. శ్రావణ మాసం ముగిసేలోపు ఒక మంచి ముహూర్తాన పార్టీ పేరు, జెండా రంగులను అధికారికంగా ప్రకటించనున్నారు. ఇప్పటికే ఆయన కుమార్తె నేహా రెడ్డి ఆధ్వర్యంలో 'భారత జన వికాస్' పేరిట ఒక బలమైన డిజిటల్ మీడియా నెట్‌వర్క్‌ను బిల్డ్ చేస్తున్నారని, పార్టీ ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఇదొక పెద్ద అస్త్రంగా మారబోతోందని టాక్. అదే పేరుని రిజిస్టర్ కూడా చేసారనే టాక్ నడుస్తోంది.
ఇప్పుడు అందరినీ తొలిచేస్తున్న అతిపెద్ద ప్రశ్న.. ఈ పార్టీ బీజేపీకి దగ్గరగా ఉంటుందా..? విజయసాయిరెడ్డికి దిల్లీ పెద్దలతో, ముఖ్యంగా బీజేపీ అగ్రనేతలతో ఎలాంటి క్లోజ్ రిలేషన్స్ ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పొలిటికల్ సర్కిల్స్ ప్రకారం.. ఏపీలో వైఎస్ఆర్సీపీ వేగంగా ఖాళీ అవుతున్న తరుణంలో, ఆ యాంటీ-కూటమి ఓటు బ్యాంక్ మళ్లీ జగన్ వైపు వెళ్లకుండా.. దిల్లీకి అనుకూలంగా ఉండే ఒక బలమైన ప్రత్యామ్నాయ ప్రాంతీయ శక్తిని నిలబెట్టాలనేదే కేంద్ర పెద్దల వ్యూహం కావచ్చు. అసలు విజయసాయిరెడ్డి అంతిమ లక్ష్యం ఏంటంటే.. కేవలం ప్రతిపక్ష హోదా కోసం కాకుండా, ప్రజా సమస్యలపై పోరాడుతూ రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ స్థానాన్ని పూర్తిగా రీప్లేస్ చేసి, ఏపీలో సెకండ్ లార్జెస్ట్ పొలిటికల్ ఫోర్స్‌గా తన కొత్త పార్టీని ఎస్టాబ్లిష్ చేయడమే.