Top story: వైఎస్ షర్మిల ఇంట పెళ్లి సందడి షర్మిల అల్లుడు ఎవరో తెలుసా..? అమెరికా డాక్టర్‌తో అంజిలి రెడ్డి వివాహం.!

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇంట త్వరలోనే పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. గతంలో తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహాన్ని ఘనంగా జరిపించిన షర్మిల, ఇప్పుడు తన కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి వివాహానికి సిద్ధమయ్యారు.

Post Published By: dialnews
Updated : 7 September 2026, 9:26 PM IST

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇంట త్వరలోనే పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. గతంలో తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహాన్ని ఘనంగా జరిపించిన షర్మిల, ఇప్పుడు తన కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి వివాహానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు వైఎస్ షర్మిల మరియు ఆమె భర్త అనిల్ కుమార్ సోషల్ మీడియా వేదికగా తమ కుమార్తె పెళ్లి నిశ్చయమైనట్లు అధికారికంగా సంతోషకరమైన వార్తను పంచుకున్నారు. ఈ వార్త బయటకు రాగానే అటు వైఎస్సార్ అభిమానులు, ఇటు కాంగ్రెస్ శ్రేణులు షర్మిల కుటుంబానికి పెద్ద ఎత్తున అభినందనలు తెలుపుతున్నారు. అసలు షర్మిలకు కాబోయే అల్లుడు ఎవరు? ఆయన బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? అలాగే వైఎస్ఆర్ మనవరాలైన అంజిలి రెడ్డి ఏం చదువుకుంది? ప్రస్తుతం ఏం చేస్తోంది?

వైఎస్ షర్మిల కుమార్తె అంజిలి రెడ్డిని చేసుకోబోయే వరుడి పేరు డాక్టర్ సోమాల రఘురామ్ రెడ్డి. ఈయన అమెరికాలో స్థిరపడిన ఒక ప్రముఖ వైద్యుడు. రఘురామ్ రెడ్డి తల్లిదండ్రులు శ్రీ సోమాల సుబ్బా రెడ్డి మరియు శ్రీమతి సోమాల పద్మా రెడ్డి. ట్విస్ట్ ఏంటంటే.. ఈ వరుడి కుటుంబ సభ్యులందరూ ప్రస్తుతం అమెరికా పౌరులే అయినప్పటికీ, వారి అసలు స్వస్థలం మాత్రం మన ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా. అంటే అమెరికాలో సెటిల్ అయినా.. మన తెలుగు మూలాలు ఉన్న కుటుంబానికి చెందిన డాక్టర్‌తోనే షర్మిల తన కుమార్తె వివాహాన్ని నిశ్చయించారన్నమాట. "నా భర్త అనిల్ కుమార్ మరియు నేను దేవునికి ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ శుభవార్తను పంచుకుంటున్నాము. మా ఫ్రెండ్స్, వెల్ విషర్స్ అందరి ప్రార్థనలు మాకు కావాలి" అంటూ షర్మిల తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.

మరి చాలా మందికి ఉన్న అనుమానం ఏంటంటే.. షర్మిల కొడుకు రాజారెడ్డి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా చేస్తున్నాడని తెలుసు, కానీ కుమార్తె అంజిలి రెడ్డి ఏం చేస్తుంది? వైఎస్ఆర్ మనవరాలైన అంజిలి రెడ్డి చదువు, కెరీర్ వివరాల్లోకి వెళ్తే.. ఆమె చాలా బ్రిలియంట్ స్టూడెంట్. అంజిలి రెడ్డి ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. అక్కడ ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయం నుండి BBA Finance అంటే.. బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ఫైనాన్స్.. డిగ్రీని విజయవంతంగా పూర్తి చేశారు. గతంలో అంజిలి రెడ్డి ఫైనాన్స్ డిగ్రీ పూర్తి చేసుకున్నప్పుడు.. షర్మిల సోషల్ మీడియాలో ఎంతో గర్వంగా తన పిల్లల అకడమిక్ మైలురాళ్లను షేర్ చేశారు.

అంజిలి రెడ్డి ఫైనాన్స్ రంగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత, ప్రస్తుతం అమెరికాలోనే ఫైనాన్స్ మరియు కార్పొరేట్ సెక్టార్‌కి సంబంధించిన ప్రముఖ మేనేజ్‌మెంట్ విభాగాల్లో ప్రాజెక్టులు చూసుకుంటున్నట్లు సమాచారం. చదువు ముగిసిన కొద్ది కాలానికే ఆమెకు నచ్చిన, ఈక్వల్ క్వాలిఫికేషన్ ఉన్న డాక్టర్ రఘురామ్ రెడ్డితో పెళ్లి కుదరడం విశేషం. ఫైనల్ గా వైఎస్ రాజశేఖర రెడ్డి మనవరాలు, షర్మిల కుమార్తె అంజిలి రెడ్డి త్వరలోనే అమెరికా డాక్టర్ రఘురామ్ రెడ్డితో ఏడడుగులు వేయబోతోంది. రాజారెడ్డి పెళ్లికి సీఎం చంద్రబాబుతో సహా అందరినీ పిలిచినట్లే.. ఈ పెళ్లికి కూడా ఏపీ, తెలంగాణ రాజకీయ ప్రముఖులంతా హాజరయ్యే అవకాశం ఉంది.

Published : 
  • 7 September 2026, 9:26 PM IST