టాలీవుడ్‌కి దూరంగా సాయి పల్లవి.!

సాయి పల్లవి టాలీవుడ్‌కి దూరంగా ఉంటున్నారనే వార్తలు ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తెలుగు ప్రేక్షకులు ఆమెను ఎంతో ప్రేమగా 'లేడీ పవర్ స్టార్' అని పిలుచుకుంటారు. గత ఐదేళ్ల కాలంలో ఆమె తెలుగులో చేసిన సినిమాలు చాలా తక్కువనే చెప్పాలి.

Post Published By: dialnews
Updated : 8 September 2026, 1:05 PM IST

సాయి పల్లవి టాలీవుడ్‌కి దూరంగా ఉంటున్నారనే వార్తలు ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తెలుగు ప్రేక్షకులు ఆమెను ఎంతో ప్రేమగా 'లేడీ పవర్ స్టార్' అని పిలుచుకుంటారు. గత ఐదేళ్ల కాలంలో ఆమె తెలుగులో చేసిన సినిమాలు చాలా తక్కువనే చెప్పాలి. అయితే చేసిన ఆ కొన్ని సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. చివరిగా ఆమె హీరోయిన్‌గా నటించిన 'తండేల్' సినిమా భారీ విజయాన్ని నమోదు చేసింది. వంద కోట్లకు పైగా వసూళ్లతో ఆ ఏడాది టాప్ చిత్రాల జాబితాలో నిలిచింది.'తండేల్' కంటే ముందు 'లవ్ స్టోరీ', 'శ్యామ్ సింగరాయ్', 'విరాట పర్వం' వంటి హిట్లతో ఆమె అదరగొట్టింది. ముఖ్యంగా 'విరాట పర్వం' చిత్రంలో సాయి పల్లవి నటనకు విమర్శకుల నుంచి విశేష ప్రశంసలు దక్కాయి.

ఇన్ని వరుస విజయాలు అందుకున్నప్పటికీ ఆమె టాలీవుడ్‌లో కనిపించకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఆమెకు తెలుగులో ఆఫర్లు రావడం లేదా లేక కావాలనే తిరస్కరిస్తున్నారా అనే సందేహాలు వస్తున్నాయి. తగిన కథలు దొరకకపోవడం వల్లే ఆమె టాలీవుడ్‌కి దూరంగా ఉండాల్సి వస్తుందని కొందరు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పూర్తిగా బాలీవుడ్ సినిమాలపైనే ఎక్కువ దృష్టి పెట్టినట్లు స్పష్టంగా తెలుస్తోంది.
గతేడాది వచ్చిన 'తండేల్' తర్వాత ఆమె వరుసగా హిందీ ప్రాజెక్ట్‌లను లైన్‌లో పెట్టింది. ఈ ఏడాది 'ఏక్ దిన్' అనే టైటిల్‌తో రూపొందిన హిందీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం కమర్షియల్ ఫలితం ఎలా ఉన్నప్పటికీ ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఈ సినిమాతో బాలీవుడ్‌లో ఆమె క్రైజ్ మరింతగా పెరిగిపోయిందని చెప్పుకోవచ్చు.

దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'రామాయణ' చిత్రంలోనూ ఆమె నటిస్తోంది. ఇందులో ఆమె సీత పాత్రలో కనిపించనుండటం విశేషం.అంతేకాకుండా త్వరలో ఆమె నటించిన తమిళ చిత్రం 'ఓం' కూడా విడుదల కాబోతోంది. ఈ చిత్రంలో ధనుష్ హీరోగా నటించగా, రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు. అయితే ధనుష్ సినిమా కావడంతో ఇందులో సాయి పల్లవి పాత్రకు ప్రాధాన్యత తక్కువ ఉండొచ్చని టాక్. హిందీ మరియు తమిళ చిత్రాలు చేస్తున్న ఆమె తెలుగును ఎందుకు పక్కన పెడుతుందోనని చర్చ జరుగుతోంది. గ్యాప్ తరువాత భవిష్యత్తులో తెలుగులో ఆమె చేయబోయే ప్రాజెక్ట్‌లు ఎలాంటి విజయాలు అందుకుంటాయో వేచి చూడాలి.

Published : 
  • 8 September 2026, 1:05 PM IST