టాలీవుడ్ హీరో సుమంత్ నటించిన సోషియో ఫాంటసీ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం 'మహేంద్రగిరి వారాహి' సెప్టెంబర్ 11న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైంది. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్‌తో ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. తాజాగా సెన్సార్ పనులు ముగించుకున్న ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు 'యూ/ఏ' సర్టిఫికెట్ ఇచ్చింది.
పురాతన మహేంద్రగిరి నేపథ్యంలో సాగే ఈ చిత్రం, వారాహి అమ్మవారికి సంబంధించిన ఒక రహస్యమైన తరాల శాపం చుట్టూ తిరుగుతుంది.
ఈ సినిమాలో సుమంత్ తో పాటు మీనాక్షి గోస్వామి, ఐశ్వర్య రాజేష్, మాళవికా నాయర్ కీలక పాత్రల్లో నటించగా, సిద్ధు జొన్నలగడ్డ ఒక క్యామియో పాత్రలో కనిపించనున్నారు. రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్ మరియు బ్రిడ్జ్ ఫిల్మ్స్ బ్యానర్లపై కాళిపు మధు, సురభి లక్ష్మణ్ రావు నిర్మించిన ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించాడు.