దసరా' వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా మూవీ 'ది పారడైజ్'.ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ ట్రెండింగ్‌లో నిలిచాయి.
ఈ చిత్రంలో కయాదు లోహార్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. మోహన్ బాబు, రాఘవ్ జుయల్, సోనాలి కుల్కర్ణి, సంపూర్ణేష్ బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సినిమా వాయిదా పడుతుందంటూ వస్తున్న వదంతులకు చెక్ పెడుతూ.. సెప్టెంబర్ 24నే సినిమా విడుదలవుతుందని మేకర్స్ స్పష్టమైన పోస్టర్‌తో క్లారిటీ ఇచ్చారు.