ఏపీలో అందరి కళ్ళు విజయనగరం పైనే ఉన్నాయి. విజయనగరం రాజకీయాలను ఇన్నాళ్లు శాసించిన బొత్స సత్యనారాయణ కుటుంబం రెండుగా చీలిపోయింది. బొత్స మేనల్లుడు చిన్న శ్రీను తన కూతురు సిరి సహస్రతో కలిసి టిడిపిలో చేరిపోయారు. దీనికి ప్రధాన కారణం స్థానిక సంస్థల ఎన్నికల్లో చిన్న శ్రీను తన ఉనికి ఏంటో చాటుకోవాలనుకోవడమే. ఇన్నాళ్లు కుడి భుజంలా పనిచేసిన మేనల్లుడు ఇప్పుడు ఏకంగా ప్రత్యర్థిగా మారిపోవడంతో సత్తిబాబు షాక్ అయిపోయారు. రాజకీయం కోసం కుటుంబం విడిపోవాలా అంటూ ఆయన కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
సత్తిబాబు, చిన్న శ్రీను మధ్య విభేదాలకు ప్రధాన కారణం కూతుళ్లు. బొత్స తన కూతురు అనూష ని రాజకీయాల్లోకి తీసుకొస్తున్నారు. మీ పిల్లలు రాజకీయాల్లోకి రావచ్చు గాని...మేం రాకూడదా... అని ప్రశ్నిస్తూ చిన్న శీను కూడా తన రెండో భార్య కుమార్తె సిరి సహస్రాని పాలిటిక్స్ లో దింపారు. విజయనగరం జిల్లాలో సహస్ర ఇప్పటికే జనంలో బాగా తిరుగుతూ సిరిమ్మ అనే పిలుపును పాపులర్ చేసుకుంది.
విజయనగరం జడ్పీ చైర్మన్గా సిరి సహస్రను నిలబడ్డానికి శీను ఇప్పటికే గ్రౌండ్ వర్క్ పూర్తి చేసుకున్నారు. సత్తిబాబు కి విజయనగరం పై ఎంత పట్టు ఉంటుందో చిన్న శీను కూడా అంతే పట్టు ఉంటుంది.
బొత్స కూడా కూతురు అనూషని స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయనగరం జడ్పీ చైర్మన్గా బరిలోకి దింపాలని డిసైడ్ అయిపోయారు.2029 లో అనూష నీ చీపురిపల్లి ఎమ్మెల్యేగా కూడా నిలబెట్టాలని ప్లాన్ చేసుకుంటున్నారు. ఈసారి స్థానిక సంస్థలు ఎన్నికల్లో జడ్పీ చైర్మన్లు, మేయర్లు ప్రత్యక్షంగా ఎన్నికవుతారు. ఏ పార్టీకైనా సరే జడ్పీ చైర్మన్లు, మేయర్లు ప్రతిష్టాత్మకమే. ఎమ్మెల్యే ,ఎంపీ ఎన్నిక కంటే జడ్పీ చైర్మన్ ల ఎన్నిక పార్టీలకు పెద్ద ఛాలెంజ్. విజయనగరం జడ్పీ చైర్మన్ పదవి కి అనూష, సిరి సహస్ర ఇద్దరు పోటీ పడిపోతున్నారు. సిరి సహస్ర ఇప్పటికే జనంలో పూర్తిగా తిరిగేసారు.
ఒకవేళ విజయనగరం జడ్పీ చైర్మన్ గా పోటీ చేయడం సాధ్యం కాకపోతే సిరి సహస్రని విజయనగరం సిటీ కార్పొరేషన్ మేయర్ గా నైనా సరే నిలబెట్టడం ఖాయం.అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో వదిన మరదళ్ళు ఇద్దరూ ముఖాముఖి పోటీకి తలపడుతున్నారు. అంటే బొత్స సత్యనారాయణ, ఆయన మేనల్లుడు మధ్య శ్రీనివాసరావు ఇద్దరూ ఫేస్ టు ఫేస్ తలపడుతున్నట్లే. తండ్రుల అండదండతో కూతుర్లిద్దరూ నువ్వా నేనా అనేది తెలుసుకోబోతున్నారు. నిజానికి నిన్నటి వరకు ఒకే కుటుంబానికి చెందిన వీళ్ళిద్దరూ ఇప్పుడు ప్రత్యర్ధులుగా వైసీపీ టీడీపీ తరఫున విజయనగరం జడ్పీ చైర్మన్ పోస్ట్ కి పోటీ పడతారు. కూతుళ్లు కోసం తండ్రులు ఇద్దరు తెర వెనక చక్రం తిప్పుతారు. బహుశా తెలుగు రాష్ట్రాల్లో ఏ జిల్లాలోనూ ఇలాంటి పోటీ చూడలేం. చిన్న శ్రీనుకి సహస్ర రెండో భార్య కుమార్తె. ఆ విషయంలో చిన్న శ్రీను క్యారెక్టర్ ని స్థానికంగా ప్రత్యర్ధులు కొంత డ్యామేజ్ చేసే అవకాశం ఉంది. కానీ తన మాటలతో... కలుపుగోలుతనంతో సిరి సహస్ర జనాన్ని బాగా ఆకట్టుకుంటున్నారు. కాబట్టి రెండో భార్య కుమార్తె అనేముద్ర ఆమెని ఏమి చేయలేకపోవచ్చు.
ఇక బొత్స అనూష విషయానికొస్తే... ఇంతకాలం తల్లి తండ్రి చాటున పెరిగిన డాక్టర్ అనూష ఇప్పుడిప్పుడే జనంలో తిరుగుతున్నారు. సత్తిబాబు పలుకుబడి.స్థానిక రాజకీయాలపై ,ప్రజలపై ఆయనకు ఉండే పట్టు అనూష కి అడ్వాంటేజ్ అవుతాయి. చిన్న శ్రీను కి కూడా అదే స్థాయిలో విజయనగరం పై పట్టు ఉంది. ఆర్థికంగా కూడా శ్రీను ఇప్పుడు బలమైన స్థితిలో ఉన్నారు. సిరి సహస్ర కున్న అడ్వాంటేజ్.... ఆమె ఇప్పుడు అధికార పార్టీ అభ్యర్థి. తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఎంపీలు, ప్రభుత్వ యంత్రాంగం మొత్తం సిరి సహస్రకి కచ్చితంగా అండగా నిలబడతారు. బొత్స ఇమేజ్ ఉష కి అడ్వాంటేజ్ అయితే... అధికార పార్టీ అభ్యర్థి కావడం సహస్రకి అడ్వాంటేజ్. ఏది ఏమైనా తండ్రుల మధ్య ఉన్న పగ ప్రతీకారం కూతుళ్లు తీర్చుకుంటారా లేదా అన్నది రాబోయే స్థానిక సంస్థలు ఎన్నికలు తేల్చబోతున్నాయి.