Hero: ప్రణతి ముద్దు పేరు రివీల్ చేసిన జూ.ఎన్టీఆర్‌

అమ్మ తర్వాత భార్యను ఎన్టీఆర్ ఎంత ప్రేమిస్తాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈవెంట్ అయినా.. ఇంటర్వ్యూ అయినా.. తాను హోస్ట్ చేసే ప్రోగ్రామ్ అయినా.. ఏదో ఒక సందర్భంలో భార్య ప్రణతి గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తాడు తారక్.

Post Published By: Srikar Creator
Updated : 26 March 2023, 10:00 PM IST

అంత ప్రేమ ఆమె అంటే అతనికి ! ఇద్దరు కలిసి బయటకు వచ్చినప్పుడు ఆ ఫ్రేమ్ చూసేందుకు అభిమానులకు రెండు కళ్లు చాలవు. కోట్లమంది ఎన్టీఆర్‌కు అభిమానులు అయితే.. తారక్ మాత్రం ప్రణతికి అభిమాని అన్నట్లుగా ప్రేమ చూపిస్తుంటారు. ఫ్యామిలీకి ఎన్టీఆర్‌ ఇచ్చే ప్రిఫరెన్స్‌ అలాంటింది. ఐతే తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను ఎన్టీఆర్‌ ఎక్కువగా సోషల్ మీడియాలో పంచుకోరు. ఐతే ప్రణతి పుట్టినరోజు సందర్భంగా.. సోషల్ మీడియా వేదికగా తారక్ శుభాకాంక్షలు చెప్పాడు. ఫారిన్‌కు ఫ్యామిలీతో కలిసి ట్రిప్‌ వెళ్లినప్పుడు.. ప్రణతితో కలిసి దిగిన ఫొటోను షేర్‌ చేశాడు తారక్.

హ్యాపీ బర్త్‌ డే అమ్మలు అంటూ లవ్‌ సింబల్స్‌ ట్యాగ్‌ చేశాడు. ప్రణతిని ముద్దుగా అమ్మలు అని పిలుస్తానని రివీల్ చేశాడు తారక్. ఎన్టీఆర్ సతీమణి ప్రణతి చాలా సింపుల్‌గా ఉంటారు. సోషల్ మీడియాలో కూడా చాలా తక్కువగా కనిపిస్తుంటుంది. ఎన్టీఆర్ కూడా తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ తప్ప.. ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో పంచుకోవడం రేర్. పిల్లలతో కలిసి ఉన్న ఫోటోలను కూడా అరుదుగా పోస్ట్ చేస్తూ ఉంటారు. భార్య పుట్టినరోజు సందర్భంగా ప్రణతికి ప్రత్యేకమైన విషెస్ చెప్తూ తారక్ షేర్ చేసిన ఫొటో అభిమానులు ఖుషీ చేస్తోంది. ముఖ్యంగా ఆ ట్యాగ్‌లైన్‌ ప్రతీ ఒక్కరి మనసు గెలుచుకుంటోంది. ప్రతీ ఆడపిల్లను అమ్మ అని పిలిచే ఎన్టీఆర్‌.. తన భార్యను అమ్మలు అని పిలవడం.. అతని కేరక్టర్‌కు అద్దం పడుతుందని.. భార్య అంటే ఎంత ప్రేమో చెప్తుందని ఫ్యాన్స్ తెగ సంబరపడుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Jr NTR (@jrntr)

Published : 
  • 26 March 2023, 10:00 PM IST