SUKUMAR: విజయ్‌తో సినిమా ఉంది.. కాని షరతులు వర్తిస్తాయ్..!

చరణ్‌తో సుకుమార్ తీయబోయేది రౌడీ స్టార్‌తో అనుకున్న సినిమా కథే అంటున్నారు. నిజానికి లైగర్ రాకముందు విజయ్ దేవరకొండతో సుకుమార్ ఓ వైల్డ్ లవర్ కాన్సెప్ట్ ఎంచుకున్నాడన్నారు. లైగర్ ఫ్లాప్‌తో సీన్ రివర్సై, రౌడీకి దూరంగా జరిగాడు సుకుమార్.

Post Published By: narender Thiru
Updated : 23 March 2024, 3:54 PM IST

SUKUMAR: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో సుకుమార్ ప్లాన్ చేసిన సినిమా ఉంది. కాకపోతే అదే కథ ఇప్పుడు రామ్ చరణ్‌తో సినిమాగా మార్చబోతున్నాడు సుకుమార్ అని అంటున్నారు. గేమ్ ఛేంజర్ తర్వాత బుచ్చి బాబు మేకింగ్‌లో పెద్దిగా మారబోతున్నాడు చరణ్. ఈ నెల 26 న గేమ్ ఛేంజర్ సాంగ్ లాంచ్ కాబోతోంది. జరగండి సాంగ్ రిలీజైన 24 గంటల్లో.. అంటే చరణ్ బర్త్ డే అయిన 27న గేమ్ ఛేంజర్ టీజర్ రాబోతోంది. అలానే పెద్ది పోస్టర్‌తో పాటు, సుకుమార్‌తో చరణ్ చేయబోయే సినిమా తాలూకు ఎనౌన్స్‌మెంట్ రాబోతోంది.

KANGUVA VS KALKI 2898 AD: కంగువ కథ అదే అయితే.. కల్కి కత్తిరిస్తాడు..

అయితే, చరణ్‌తో సుకుమార్ తీయబోయేది రౌడీ స్టార్‌తో అనుకున్న సినిమా కథే అంటున్నారు. నిజానికి లైగర్ రాకముందు విజయ్ దేవరకొండతో సుకుమార్ ఓ వైల్డ్ లవర్ కాన్సెప్ట్ ఎంచుకున్నాడన్నారు. లైగర్ ఫ్లాప్‌తో సీన్ రివర్సై, రౌడీకి దూరంగా జరిగాడు సుకుమార్. అయితే అది ఆర్యని, అర్జున్ రెడ్డి స్టైల్లో తీస్తే ఎలా ఉంటుందో అంత వైల్డ్‌గా ప్లాన్ చేసిన వెరైటీ ప్రేమ కథ అని తెలుస్తోంది. త్రిబుల్ ఆర్‌తో గ్లోబల్ స్టార్‌గా మారిన చరణ్‌తో, వైల్డ్ లవ్ స్టోరీ అంటే ఇమేజ్‌కి తగ్గ సినిమా అనలేం.

అందుకే రౌడీ స్టార్‌తో సుకుమార్ ప్లాన్ చేసిన కథ అలా హోల్డ్‌లోనే ఉంచి, కొత్త కథతో రామ్ చరణ్ మూవీ ప్లాన్ చేస్తున్నాడట సుకుమార్. ఐతే పుష్ప 3 ఉంటే బన్నీతో లేదంటే చరణ్ మూవీ పూర్తికాగానే విజయ్‌తో సినిమా తీసే అవకాశం ఉంది. అది కూడా ఫ్యామిలీ స్టార్‌తోపాటు మిగతా మూవీలు హిట్ మెట్టెక్కితేనే అనంటున్నారు.

Published : 
  • 23 March 2024, 3:54 PM IST