Trivikram: మహేశ్ లానే బాంబు పేల్చనున్న పవర్ స్టార్

మహేశ్ బాబుతో త్రివిక్రమ్ సినిమా ఆగస్ట్ 11 న కాదు, సంక్రాంతికే అంటూ ఫిల్మ్ టీం బాంబు పేల్చింది. ఆగస్టుకి పండగ చేసుకోవాలనుకున్న ఫ్యాన్స్ కి పంచ్ పడింది. ఇలా వాళ్లు షాక్ లో ఉంటే పవన్ కళ్యాణ్ మరోరకంగా ఇండస్ట్రీకి షాక్ ఇచ్చేలా ఉన్నాడు.

Post Published By: Srikar Creator
Updated : 27 March 2023, 11:00 PM IST

అదే తన హరి హర వీరమల్లుని సంక్రాంతికి బరిలోకి దింపబోతున్నాడట పవన్ కళ్యాణ్. ఇప్పటికే సంక్రాంతికి ప్రాజెక్ట్ కే వస్తుండటం, దానికి పోటీగా మహేశ్ మూవీ కన్ఫామ్ అవ్వటం జరిగింది. ఇంకా శంకర్ మేకింగ్ లో రామ్ చరణ్ చేస్తున్న గేమ్ ఛేంజర్ రాబోతోందని తెలుస్తోంది. ఇలాంటి టైంలో హరి హర వీరమల్లు మూవీ పొంగల్ పోరులో దిగితే ఇక నిర్మాతల జేబులు, కలెక్షన్ల రూపంలో చీలిపోతాయి.

ప్రజెంట్ వినోదియం సీతంలో దేవుడి అవతారం ఎత్తిన పవన్, తన పాత్ర తాలూకు షూటింగ్ పూర్తి చేశాడు. ఏప్రిల్ 5 నుంచి సుజీత్ మేకింగ్ లో ఓరిజినల్ గ్యాంగ్ స్టర్ మూవీ కోసం 20 రోజుల డేట్లు కేటాయించాడు. ఆ వెంటనే ఉస్తాద్ భగత్ సింగ్, అతర్వాత హరి హర వీరమల్లు షూటింగ్స్ ప్లాన్ చేసుకన్నాడు. ఇక జులై 28 కి వినోదియం సీతం రీమేక్ రిలీజ్ ప్లాన్ చేస్తే దసరాకు ఓజీ అంటున్నారు. సంక్రాంతికి హరి హర వీరమల్లు ని రిలీజ్ చేసి, సమ్మర్ లో ఉస్తాద్ భగత్ సింగ్ ని ప్లాన్ చేస్తున్నట్టు కొత్తగా సమాచారం అందుతోంది. ఇలా ఒక్కొక్కరుగా సంక్రాంతి మీద దండెత్తితే, బాక్సాఫీస్ ముక్కలౌతుంది.

Published : 
  • 27 March 2023, 11:00 PM IST