బ్రేకింగ్: హీరోయిన్ వ్యవహారంపై చంద్రబాబు ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్ లో వారం రోజుల నుంచి సంచలనం రేపుతున్న ముంబైకి చెందిన హీరోయిన్ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది.

Post Published By: Vencateshg
Updated : 29 August 2024, 1:09 PM IST

ఆంధ్రప్రదేశ్ లో వారం రోజుల నుంచి సంచలనం రేపుతున్న ముంబైకి చెందిన హీరోయిన్ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. పలువురు ఐపిఎస్ అధికారుల పాత్ర ఉందనే ఆరోపణ నేపధ్యంలో ఏపీ ప్రభుత్వం రంగంలోకి దిగింది. దీనిపై సిఎం చంద్రబాబు ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించారు. ముంబై హీరోయిన్ జిత్వాని వ్యవహారంపై మీడియాలో వస్తున్న కథనాలను చంద్రబాబు పరిశీలించారు.

జిత్వానీతో ఆన్లైనన్లోు ఫిర్యాదు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రతి అంశాన్ని క్షుణంగా దర్యాప్తు చేయాలని ఆదేశించారు చంద్రబాబు. ఘటన పై కమిటీ నీ నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. వైసీపీ నాయకులతో పాటు...కొందరు ఐపిఎస్ అధికారులపై కూడా ఆమె ఆరోపణలు చేసింది. ఇక నిన్న ఒక ప్రముఖ ఛానల్ లో ఆమె తనకు జరిగిన అన్యాయంపై వివరించారు. ఈ కేసులో పాత్రధారులు సూత్రధారులపై సమగ్రమైన విచారణ నిర్వహించి నివేదిక ఇవ్వాలని డిజిపిని సీఎం ఆదేశించారు.

Published : 
  • 29 August 2024, 1:09 PM IST