Top Story:జగన్ ని అరెస్ట్ చేసే దమ్ముందా…? చంద్రబాబు జగన్ ని ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు…?

నేను తలుచుకుంటే నిన్ను ఇప్పుడే అరెస్ట్ చేయగలను. ఇలాంటి వ్యక్తులను అరెస్టు చేయాలంటే నాకు ఎంత సేపు పడుతుంది...? జగన్ని తాను ఏ క్షణంలోనైనా అరెస్టు చేయించగలనని ఏపీ సీఎం చంద్రబాబు బహిరంగంగా చెప్పిన మాటలు ఇవి

Post Published By: dialnews
Updated : 12 April 2026, 10:52 AM IST

నేను తలుచుకుంటే నిన్ను ఇప్పుడే అరెస్ట్ చేయగలను. ఇలాంటి వ్యక్తులను అరెస్టు చేయాలంటే నాకు ఎంత సేపు పడుతుంది...? జగన్ని తాను ఏ క్షణంలోనైనా అరెస్టు చేయించగలనని ఏపీ సీఎం చంద్రబాబు బహిరంగంగా చెప్పిన మాటలు ఇవి. ఆ రోజు కోసమే టిడిపి నాయకులు, కార్యకర్తలు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ అరెస్ట్ అన్నది తెలుగు రాష్ట్రాల్లో చాలాకాలం హాట్ టాపిక్ గా నడుస్తూనే ఉంది. వైసిపి 2024 ఎన్నికల్లో దారుణంగా ఓడిపోగానే జగన్నీ ఇక జైల్లో వేయడం ఖాయమని టిడిపి కార్యకర్తలు అంతా డిసైడ్ అయిపోయారు . జగన్ని లిక్కర్ స్కాంలో అరెస్టు చేస్తారా? బాబాయ్ వివేక హత్య కేసులో అరెస్టు చేస్తారా? పాత అక్రమార్చన కేసుల్లో మళ్లీ జైలుకు పంపుతారా? ఏ ఏ కేసుల్లో జగన్ని అరెస్టు చేస్తారు? అనే చర్చ తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఏపీలో కూటమి సర్కార్ వచ్చి రెండు సంవత్సరాలు అయిపోతుంది. జగన్ అరెస్ట్ కాదు కదా కనీసం ఎఫ్ఐఆర్ కూడా చేయలేకపోయింది చంద్రబాబు సర్కార్. ఇప్పుడు హఠాత్తుగా చంద్రబాబు
నిన్ను అరెస్టు చేయడం కష్టమేమీ కాదు అంటూ కామెంట్ చేయడం వెనక వ్యూహం ఏమిటని మరో చర్చ జరుగుతుంది.

ఎవరు ఎలా చర్చించినా... వైసీపీ అధినేత అరెస్ట్ అంత తేలిక కాదు. దీనికి ప్రధాన కారణం ఏపీలో పార్టీలు, వాటి అధినేతలు అందరూ కేంద్రంలోని బిజెపి కంట్రోల్లోనే ఉంటారు. ప్రధాని నరేంద్ర మోడీ , హోం మంత్రి అమిత్ షా నీ కాదని ఎవ్వరు ఏపీలో పెద్ద నిర్ణయాలు తీసుకునేందుకు సాహసించలేరు. జగన్ని ఏ కేసులోనైనా అరెస్టు చేయాలంటే అందుకు కచ్చితంగా మోడీ గ్రీన్ సిగ్నల్ ఉండాల్సిందే.2023లో స్కిల్ డెవలప్మెంట్ కేసులో జగన్ సర్కార్ అప్పటి టిడిపి అధ్యక్షుడు చంద్రబాబును అరెస్టు చేసి 52 రోజులు జైల్లో పెట్టింది. ఏపీ హిస్టరీలో చెన్నారెడ్డి మొదలుకొని.. కెసిఆర్ వరకు 45 ఏళ్లలో చంద్రబాబు నాయుడు ను ఏ ముఖ్యమంత్రి...... ఏ ఒక్క కేసులో జైల్లో పెట్టే సాహసం ఎవ్వరు చేయలేకపోయారు. చంద్రబాబుకు అత్యంత బలమైన రాజకీయ ప్రత్యర్థైన వైయస్ రాజశేఖర్ రెడ్డి కూడా ఆయన ను జైల్లో పెట్టలేకపోయాడు.

ఒక్క జగన్ మాత్రమే తెగించి ఎన్నికలకు ముందు... తన రాజకీయ ప్రయోజనాలను కూడా పక్కనపెట్టి చంద్రబాబును అరెస్టు చేసి 52 రోజులు జైల్లో పెట్టారు. రాజకీయంగా నష్టపోతానని తెలిసినా జగన్ తెగించారు. అప్పట్లో చంద్రబాబుకి... తెలుగుదేశం పార్టీకి అదో పెద్ద షాక్. ఇప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబుకు అవకాశం వచ్చింది. టిడిపి, జనసేన నేతలు, కార్యకర్తలు జగన్ ని చంద్రబాబు ఎప్పుడు లోపల వేస్తారా? అని ఎదురుచూస్తున్నారు. కానీ చంద్రబాబు ఆ పని చేయలేరు. దానికి ఆయన చట్టం, న్యాయం, లీగల్ స్ట్రాటజీ లాంటి పదాలు చెప్పి తెలివిగా తప్పించుకుంటున్నారు.2019 నుంచి 24 వరకు తమను అష్ట కష్టాలు పెట్టిన వైసీపీ అధినేతను చంద్రబాబు బొక్కలో ఎందుకు వేయడు అనే ప్రశ్న ప్రతి టిడిపి కార్యకర్త నీ తొలిచేస్తుంది. కానీ జగన్ ని అరెస్టు చేయాలంటే నిర్ణయం తీసుకోవాల్సింది చంద్రబాబు కాదు... ప్రధాని నరేంద్ర మోడీ. కానీ అది ఇప్పట్లో సాధ్యం కాదు. కంటికి కన్ను.... పంటికి పన్ను సిద్ధాంతాన్ని అమలు చేస్తున్న చంద్రబాబు కుమారుడు మంత్రి లోకేష్ జగన్ కి జైలు రుచి చూపించాలని చాలా తాపత్రయపడుతున్నప్పటికీ ఇప్పటివరకు ఢిల్లీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు.

జగన్ అధికారంలో ఉన్నంతవరకు రకరకాల అవినీతి ఆరోపణలు చేసిన చంద్రబాబు, లోకేష్ ,పవన్ కళ్యాణ్ లు వాళ్లు అధికారంలోకి వచ్చాక జగన్ పై ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేకపోయారు. ఒక ఛార్జిషీట్ కూడా వేయలేకపోయారు. ఏపీ లిక్కర్ స్కామ్ సహా... రకరకాల కుంభకోణాల్లో ఎక్కడ జగన్ని నిందితుడిని చేయలేకపోయారు. జగన్ బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు రాజకీయంగా ఎన్నికల్లో టిడిపికి , జనసేనకి ఉపయోగపడిందే తప్ప.... చివరికి సిబిఐ కూడా ఆ కేసులో జగన్ గాని ఆయన కుటుంబ సభ్యులు కానీ నిందితులుగా చెప్పలేకపోయింది. అంటే 2019.... 24 మధ్య చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేసినవన్నీ ఆరోపణలు తప్ప.... అవి నిజాలు కావని అనుకోవాలా? అవి నిజాలే అయితే జగన్ మీద కేసులు ఎందుకు పెట్టలేకపోతున్నారు? అరెస్టు చేసి జగన్ ని జైల్లో ఎందుకు వేయలేకపోతున్నారు? ఎల్లో మీడియా పత్రికలు, చానల్స్ రోజు రకరకాలుగా జగన్ ని డామేజ్ చేయగలుగుతున్నాయి తప్ప అతని అరెస్టు చేయించలేకపోతున్నాయి. అంటే ఎల్లో మీడియా గడచిన ఏడేళ్లుగా చేస్తున్న ఏ ఆరోపణ నిజం కాదా? చంద్రబాబు సర్కార్ ని ఎల్లో మీడియా ఎందుకు నిలదీయలేకపోతోంది?

వైసీపీ అధినేత జగన్ కి కేంద్రంలో బిజెపి ఆశీస్సులు అండదండలు ఉన్నాయా? భవిష్యత్తులో వైసీపీ తమకు ఉపయోగపడొచ్చని ,అందువల్ల ఆ పార్టీ అధినేతను ఇబ్బంది పెట్టొద్దని.... తాము చెప్పినప్పుడు మాత్రమే ముందుకెళ్లాలని చంద్రబాబు కి ,లోకేష్ కి ఢిల్లీ నుంచి ఆదేశాలు ఉన్నాయా?.. ఇలాంటి అనుమానాలు ఎన్నో జనం లో ఉన్నాయి. కూటమి సర్కారు ఏర్పడగానే పాత అక్రమార్జన కేసులో జగన్ మళ్ళీ జైల్లోకెళ్ళిపోతాడని... లోకేష్ తన రెడ్ బుక్ లో రాసుకున్నట్లుగా జగన్ పై రకరకాల కేసులు పెట్టేస్తారని, టిడిపిలో వందల వేల ఊహాగానాలు నడిచాయి. అవన్నీ ఒట్టిదే అని తెలిసిపోయింది. జగన్ ని టచ్ చేయడం చంద్రబాబు వాళ్ళ సాధ్యం కాదని... ప్రధాని నరేంద్ర మోడీ అమిత్ష ఉన్నంత వరకు ఏపీలో కూటమి నేతలు జగన్ ని ఏమి పీకలేరని.. పబ్లిక్ లో బాగా మాట్లాడుకుంటున్నారు.

టిడిపి కార్యకర్తల కళ్ళ నీళ్లు తుడవడానికి ఒకరిద్దరు ఎమ్మెల్యేలు, మరో ఇద్దరు మంత్రులను అరెస్టు చేసి జైల్లో పెట్టారే తప్ప అంతకుమించి చంద్రబాబు సర్కార్ జగన్ దగ్గరకు చేరుకోలేకపోయింది. రోజు టీవీలు, పేపర్లలో వైసిపి టిడిపి జనసేన పార్టీలు తిట్టుకోవడం తప్ప.... జగన్ని నిందితునిగా ఎక్కడ అరెస్టు చేయడం జరగలేదు. లిక్కర్ స్టేంలో ఎండ్ యూజర్ జగనేనని... అతనికి వేల కోట్లు చేరాయని ఎల్లో మీడియాలో రాసుకోవడమే తప్ప... సిట్ ఎక్కడ నిరూపించలేకపోయింది. అంటే జగన్ అవినీతికి పాల్పడలేదని, ఉత్తముడని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సర్టిఫికెట్ ఇస్తున్నారా? లేక మరి ఏదైనా కారణంతో జగన్ టచ్ చేయడానికి భయపడుతున్నారా? ఇప్పుడు జనంలో జరుగుతున్న ప్రధానమైన చర్చ ఇదే.

Published : 
  • 12 April 2026, 10:52 AM IST