పెద్దిరెడ్డికి పవన్ ముహూర్తం ఫిక్స్.. బొక్కలో తోయడానికి రంగం సిద్దం…?

ఆంధ్రప్రదేశ్ లో గత రెండు మూడు నెలలుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సెన్సేషన్ అవుతున్నారు. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా సరే అది సంచలనమే అవుతోంది. తన శాఖల పరిధిలో అలాగే ఇతర మంత్రుల శాఖలపై కూడా ఆయన గట్టిగా ఫోకస్ పెట్టారు.

Post Published By: Vencateshg
Updated : 30 January 2025, 4:45 PM IST

ఆంధ్రప్రదేశ్ లో గత రెండు మూడు నెలలుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సెన్సేషన్ అవుతున్నారు. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా సరే అది సంచలనమే అవుతోంది. తన శాఖల పరిధిలో అలాగే ఇతర మంత్రుల శాఖలపై కూడా ఆయన గట్టిగా ఫోకస్ పెట్టారు. ఎక్కడైనా తప్పులు జరుగుతుంటే వాటిపై కాస్త కఠినంగానే ఉంటున్నారు. ఇక గత ప్రభుత్వం అటవీ, ప్రభుత్వ భూములను వైసీపీ నేతలకు అప్పనంగా అప్పగించింది అనే ఆరోపణల నేపధ్యంలో వాటిపై కూడా పవన్ కళ్యాణ్ గురిపెట్టారు.

ఇటీవల కాకినాడ రేషన్ బియ్యం అక్రమాల విషయంలో పవన్ కళ్యాణ్ సీరియస్ కావడం నేషనల్ వైడ్ గా వైరల్ అయింది. ఆ తర్వాత ప్రకాశం జిల్లాలో సరస్వతి భూముల వ్యవహారంపై కూడా పవన్ కళ్యాణ్ గురి పెట్టడం, ఆ తర్వత ఆ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం జరిగాయి. ఇదే సందర్భంలో మరికొందరు మాజీ మంత్రులపై కూడా పవన్ కళ్యాణ్ గురి పెడుతున్నారు. తాజాగా పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి భూ అక్రమాల విషయంలో పవన్ ఫోకస్ పెట్టి చర్యలకు దిగారు. అధికారులకు ఈ మేరకు కీలక ఆదేశాలు ఇచ్చారు.

పెద్దిరెడ్డి.. అండ్ గ్యాంగ్ చిత్తూరు జిల్లాలో పెద్ద యెత్తున అటవీ భూములను ఆక్రమించింది అనే ఆరోపణలు వచ్చాయి. మొన్నా మధ్య మదనపల్లిలో పత్రాలను కాల్చిన వ్యవహారం కూడా సంచలనం అయింది. ఆ విషయంలో పెద్దిరెడ్డిపై చర్యలు ఉంటాయని అందరూ ఎదురు చూసారు. కాని ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి గాని పోలీసుల నుంచి గాని ముందు అడుగు పడలేదు. ఈ తరుణంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎంటర్ అయ్యారు. తాజాగా పెద్దిరెడ్డి అక్రమాల విషయంలో అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

చిత్తూరు జిల్లా మంగళంపేట సమీపంలోని అడవుల్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబం అటవీ భూములు ఆక్రమించారని వెలువడిన సమాచారంపై సమగ్రంగా విచారణ చేసి నివేదిక ఇవ్వాలని అటవీ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించిన ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్... పి.సి.సి.ఎఫ్.తో మాట్లాడుతూ అటవీ భూములు ఏ మేరకు ఆక్రమించారు, అక్కడ ఉన్న అడవులను ఏ విధంగా ధ్వంసం చేశారో విచారణ చేయాలని పవన్ కళ్యాణ్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. పుంగనూరు నియోజకవర్గం పరిధిలో ఉన్న అటవీ భూముల వివరాలు, వాటి రికార్డులను పరిశీలించాలని, ఏ మేరకు ఆక్రమణలకు గురయ్యాయో నిగ్గు తేల్చాలని ఆదేశించారు. అటవీ భూముల రికార్డులు ఎక్కడైనా తారుమారు చేశారా? చేసిన పక్షంలో అందుకు బాధ్యులెవరూ? అని ఆరా తీసిన పవన్ తద్వారా లబ్ధి పొందింది ఎవరు అనేది నివేదిక ఇవ్వాలని.. అటవీ భూములు ఆక్రమించినవారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని... తక్షణమే ప్రాథమిక నివేదిక ఇవ్వాలని పి.సి.సి.ఎఫ్ ను ఆదేశించారు.

Published : 
  • 30 January 2025, 4:45 PM IST