Top Story:ఇన్వెస్ట్ మెంట్ ఫస్ట్ జల్సాలు నెక్స్ట్ ! పలుకే బంగారం అంటున్న “జెన్ జి” స్…!

యువత, మధ్య వయసు వారి ఆలోచనా విధానం మారుతోంది. దేని మీద పెట్టుబడి పెడితే...రిటర్న్‌ వస్తాయి ? ఎందులో ఇన్వెస్ట్‌మెంట్‌ చేస్తే...నష్టాలు రావు ?

Post Published By: dialnews
Updated : 16 February 2026, 9:05 AM IST

యువత, మధ్య వయసు వారి ఆలోచనా విధానం మారుతోంది. దేని మీద పెట్టుబడి పెడితే...రిటర్న్‌ వస్తాయి ? ఎందులో ఇన్వెస్ట్‌మెంట్‌ చేస్తే...నష్టాలు రావు ? అందులోనూ భూమి బెస్టా ? లేదంటే బంగారం , సిల్వర్‌ను నమ్ముకుంటే మంచిదా అని లెక్కలు వేసుకుంటున్నారు. సంపాదించుకున్న సొమ్మును నష్టపోకుండా...జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
-జెన్‌ జీ, మిలీనియల్స్‌ ఫ్యూచర్‌ గురించి ఆలోచిస్తున్నారు. సంపాదించిన డబ్బును దుర్వినియోగం చేయడం లేదు. జాగ్రత్తగా దాచుకుంటున్నారు. జీవితంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండటానికి కేర్‌ తీసుకుంటున్నారు.

ముఖ్యంగా పెట్టుబడులపై ఇంట్రెస్ట్‌ చూపుతున్నారు. 1980 తర్వాత పుట్టిన వారంతా...ఇన్వెస్ట్‌మెంట్‌ ఫస్ట్‌...జల్సాలు నెక్స్ట్‌ అంటున్నారు. ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తూనే...పెట్టుబడుల పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. అందులో ఎలా పడితే...అలా డబ్బును ఇన్వెస్ట్‌ చేయడం లేదు. ఒకటి రెండు సార్లు ఆలోచించుకుంటున్నారు. నిపుణుల అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటున్నారు. 62 శాతం మంది జెన్‌ జీ, మిలీనియల్స్...స్టాక్స్‌, మ్యూచువల్ ఫండ్స్‌ కంటే బంగారాన్ని నమ్ముకుంటున్నారు. పసిడినే అత్యంత సురక్షిత పెట్టుబడి మార్గంగా భావిస్తున్నారు. కుటుంబ పెట్టుబడి నిర్ణయాలతో సంబంధం లేకుండా పసిడి కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నట్లు స్మిటెన్‌ పల్స్ ఏఐ వెల్లడించింది. దేశవ్యాప్తంగా 5 వేల మంది యువత నుంచి సేకరించిన అభిప్రాయాల్లో...కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.దేశంలో ప్రస్తుతం 66.7% వరకు పసిడి కొనుగోళ్లు, వ్యక్తిగత నిర్ణయాల ఆధారంగానే జరుగుతున్నట్లు సర్వేలో తేలింది.

తమ కుటుంబం చేసిన పసిడి కొనుగోళ్ల అంశంలో, తామే నిర్ణయం తీసుకున్నామని 42.3% మంది యువత తెలిపింది. తల్లిదండ్రులు లేదా కుటుంబంలో పెద్దవాళ్ల నిర్ణయమని 40% మంది వెల్లడించారు. 5 గ్రాముల లోపే పసిడి కొన్నామని 61.90% మంది చెప్పారు. 2 గ్రాముల లోపు కొనుగోలు చేసిన వాళ్లు 27.5% మంది కాగా.. 2-5 గ్రాముల మధ్య కొనుగోలు చేసిన వాళ్లు 34.4% మంది ఉన్నారు. బ్యాంక్‌లో 25 వేల రూపాయలుంటే, పసిడి కొంటామని 61.9% మంది కుండబద్దలు కొడుతున్నారు. దీంతో పోలిస్తే మ్యూచువల్ ఫండ్స్‌ 16.6%, డిపాజిట్లు 13%, షేర్లు 6.6%, క్రిప్టో 1.9% వైపు ఆసక్తి చూపిన వారి సంఖ్య చాలా తక్కువగా ఉన్నట్లు సర్వేలో తేలింది.

ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేసే యువత, మిలీనియల్స్‌, బంగారం విషయంలో మాత్రం అందుకు దూరంగా ఉంటోంది. దిగ్గజ ఆభరణాల సంస్థల్లో కొనుగోళ్లకు 38.3% మంది ప్రాధాన్యం ఇస్తున్నారు. స్థానిక విక్రయశాలలపై 34.7% మంది మొగ్గుచూపారు. 5.2% మంది మాత్రమే ఆన్‌లైన్‌లో కొనుగోళ్లు జరుపుతున్నారు.ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితులు కొనసాగుతుండటంతో...పెట్టుబడుల విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నారు. అనిశ్చితులు ఉన్నప్పుడు బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయడం, ఎంఎఫ్‌లు, షేర్ల కొనుగోలు కంటే పసిడిలో పెట్టుబడి ఉత్తమమని 65.7% మంది అభిప్రాయపడ్డారు. మొదటి జీతంతో తొలిసారి పసి

డి కొనుగోలు చేసినట్లు 24.3% మంది చెబితే... పెట్టుబడిగా పసిడిని కొనుగోలు చేసినట్లు 23.9% మంది వెల్లడించారు.

Published : 
  • 16 February 2026, 9:05 AM IST