Top story:ఎలా చం*పాడో.. అలాగే చ*చ్చాడు..!

చిన్నప్పుడు అర్ధశాస్త్రంలో చదువుకున్నట్లు.. మానవుని కోరికలు అపరిమితం. కాని ఆ కోరికలను అదుపు చేసుకున్నవాడే మనిషి అనేది అక్షర సత్యం.

Post Published By: dialnews
Updated : 19 February 2026, 9:08 AM IST

చిన్నప్పుడు అర్ధశాస్త్రంలో చదువుకున్నట్లు.. మానవుని కోరికలు అపరిమితం. కాని ఆ కోరికలను అదుపు చేసుకున్నవాడే మనిషి అనేది అక్షర సత్యం. ఆర్ధికంగా అయినా, ఆహారం అయినా, మరో కోరిక అయినా సరే అదుపు చేసుకోవాలి. జరిగే అనార్ధాలను, సమాజంపై పడే ప్రభావాలపై అవగాహన ఉండాలి. నేటి యువతలో, సమాజంలో ఇది లోపిస్తున్న మాట వాస్తవం. అత్యాచారాలు, చెడు అలవాట్లు వంటి వాటి విషయంలో ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా.. కొందరిలో మార్పు మాత్రం రావడం లేదు.

తాజాగా అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెలో ఓ ఘటన జరిగింది. ఏడేళ్ళ చిన్నారిని ఓ యువకుడు లైంగిక దాడి చేసి, ప్రాణం తీసాడు. చాక్లెట్ ఇస్తాను అంటూ పిలిచి, కులవర్ధన్ అనే యువకుడు ఆ చిన్నారిని అత్యంత పాశవికంగా హత్య చేసాడు. తండ్రి లేని అతను.. తల్లి సంపాదనతో బతుకుతూ చెడు అలవాట్లకు బానిసగా మారాడు. గంజాయి, మద్యపానం వంటి అలవాట్లకు బానిసై.. అసభ్యకర ప్రవర్తనతో సమాజానికి చీడ పురుగుగా మారాడు. ఆయాగా పని చేస్తూ తల్లి కష్టపడుతోంటే.. ఆ సొమ్ముతో అతను ఎంజాయ్ చేయడం మరింత బాధాకరం.

నాలుగు రోజుల క్రితం చిన్నారిపై బలాత్కారం చేసి, హత్య చేసిన ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు.. పొరిగింటిలో ఉండే కులవర్ధన్ పాపం చేసినట్టు తేల్చి గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులకు భయపడి అతను ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసు వర్గాలు తెలిపాయి. ఇక ఈ వ్యవహారాన్ని ప్రభుత్వ పెద్దలు కూడా సీరియస్ గా తీసుకోవడంతో పోలీసులు కూడా సీరియస్ గానే గాలింపు చేపట్టారు. చివరకు అతను ఓ చెరువులో విగత జీవిగా కనిపించాడు.

బాధితురాలికి ఏ విధంగా న్యాయం జరిగింది అనే విషయం అందరికంటే.. కులవర్ధన్ కు బాగా తెలుసు. తాను చేసిన పాపానికి దేవుడు ఏ రూపంలో వచ్చి శిక్షించాడో కూడా అతనికి తెలిసే కన్ను మూసాడు. ఏ విధంగా అయితే ముక్కుపచ్చలు ఆరని చిన్నారిని ఊపిరి ఆడకుండా చేసి ప్రాణం తీసుకున్నాడో.. అతని ప్రాణం కూడా అలాగే ఊపిరి ఆడకుండా తీసుకున్నాడు. గల్ఫ్ దేశాల మాదిరిగా తక్షణ న్యాయం జరిగిన మాట వాస్తవం. న్యాయం ఎలా జరిగిందో అతనికి మాత్రమే తెలిసిన విషయం.

అతనికే కాదు.. గతంలో ఏపీలో ఈ తరహా దారుణాలకు పాల్పడిన వారు అందరికీ.. న్యాయంపై అవగాహన ఉంది. వారికి మద్దతు ఇచ్చే మృగాలకు కూడా క్లారిటీ స్పష్టంగా ఉంది. 2018 లో సుబ్బయ్య అయినా, గత ఏడాది నారాయణ అయినా, అంతకు ముందు కడపలో రహమతుల్లా అయినా.. భవిష్యత్తులో ఇంకెవరు అయినా సరే.. పాపం చేసే ముందు.. అది ఎలా పండుతుందో కూడా స్పష్టంగా తెలుసుకోవాలని పలువురు హెచ్చరిస్తున్నారు. గతంలో మాదిరిగా సమాజానికి ఓపిక లేదు. చూస్తూ కూర్చుని, టీవీ లో చూసి విమర్శలు చేసే తీరిక అంతకన్నా లేదు. ఈ తరహా న్యాయాలను సమాజం అంగీకరిస్తోంది. నేరం చేసాడని తెలిస్తే.. గుడ్లు, బిర్యానీలు పెట్టి మేపడం కరెక్ట్ కాదని సమాజం అంటుంది.

Published : 
  • 19 February 2026, 9:08 AM IST