ఇదీ 1000 కోట్ల కాంబో..? 55 వేల థియేటర్లు దాటేన్.?

వారణాసి తర్వాత ఎన్టీఆర్ తో రాజమౌళి మూవీ అన్న వార్త వచ్చినప్పటి నుంచి, అసలు వారణాసి అప్ డేట్స్ మీద కంటే, ఎన్టీఆర్ ప్రాజెక్ట్ మీద క్యూరియాసిటీ పెరుగుతోంది జనాలకి... ఆల్రెడీ జోనరేంటి?

Post Published By: dialnews
Updated : 21 February 2026, 3:48 PM IST

వారణాసి తర్వాత ఎన్టీఆర్ తో రాజమౌళి మూవీ అన్న వార్త వచ్చినప్పటి నుంచి, అసలు వారణాసి అప్ డేట్స్ మీద కంటే, ఎన్టీఆర్ ప్రాజెక్ట్ మీద క్యూరియాసిటీ పెరుగుతోంది జనాలకి... ఆల్రెడీ జోనరేంటి? ఎప్పుడు పట్టాలెక్కుతుంది? ఎన్నడు ఎనౌన్స్ మెంట్ వస్తుంది.. ఇది కూడా 1000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కే పాన్ వరల్డ్ సినిమానేనా ఇలా చాలా పెద్ద డిస్కర్షన్ జరుగుతోంది. ఇదే విచిత్రం సగం పైగా షూటింగ్ పూర్తి చేసుకుని, జూన్ కల్లా షూటింగ్ కి పేకప్ చెప్పబోతున్న వారణాసి, ఇక దాడి చేస్తుందనేదానికంటే, ఆతర్వాత ప్రాజెక్టే చాలా మందికి ఇంట్రస్టింగ్ ఫ్యాక్టర్ గా మారిందా? దీనికి ఓ సాలిడ్ రీజనుంది.. వారణాసి టీజర్ లాంచ్ రోజే ఎన్టీఆర్ తో ప్రాజెక్ట్ ని కూడా రాజమౌళి కన్ఫామ్ చేసే ఛాన్స్ఉందట. కాకపోతే ఇక్కడ తేలాల్సింది... పాన్ వరల్డ్ లెవల్లో ఎన్టీఆర్ వైపే రాజమౌళి అడుగులు పడటానికి రీజన్... ఆ రీజన్ వెనకున్న విజన్ పెద్దది... ఒక్కసారి ఊహించుకోండి... రాజమౌలి ఏ హీరోతో సినిమాకమిటయ్యాడనే దాన్ని బట్టి, అదెంద పెద్ద రిస్కీ ప్రాజెక్టో అర్ధమైపోతుంది... తను ఎంత రిస్కీ ప్రాజెక్ట్ కి కమిటైతే, అంత క్లోజ్ హీరోతో సినిమా తీస్తాడు... దాన్ని బట్టి, ఎన్టీఆర్ తో జక్కన్న బాహుబలి, వారణాసిని మించే ఏదో రిస్క్ చేయబోతున్నాడా?

వారణాసి 1359 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కతున్న తొలి పాన్ వరల్డ్ మూవీ. 120 దేశాల్లో 100 కోట్ల మందికి రీచ్ అయ్యేలా 55 వేల థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నారు. మొదట్నుంచి వస్తున్న ప్రతీ రూమర్ ఈ సినిమా విషయంలో నిజమౌతూ వచ్చింది. కట్ చేస్తే జూన్ తో వారణాసి షూటింగ్ పూర్తవబోతోంది. ఎగ్జాక్ట్ గా వన్ ఇయర్ తర్వాత అంటే 2027 జూన్ లో రాజమౌళి డైరెక్షన్ లో ఎన్టీఆర్ సినిమాపట్టాలెక్కేలా ఉంది.ప్రస్తుతానికి ఇది ప్రచారమే.. కాకపోతే రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఆల్రెడీ నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం పేపర్ మీద పెన్ పెట్టాడు. ఎన్టీఆర్ కి రాజమౌళి ఫోన్ లోనే నెక్ట్స్ ప్రాజెక్ట్ కన్పామ్ చేయటం వల్లే, డ్రాగన్ రెండు భాగాలు వేగంగా పూర్తి చేయబోతున్నారని తేలింది. రాజమౌళి కాల్ వల్లే దేవర 2 ని వేగంగా మొదలుపెట్టి, వేగంగా పూర్తి చేసేలా ప్రణాలిక వేసినట్టు తెలుస్తోంది.

ఇదంతా బానే ఉంది. కాని 2027 జూన్ లో మొదలయ్యేలా ఎన్టీఆర్ ప్రాజెక్ట్ ని ప్లాన్ చేయటం వెనక, వారనాసి ప్రమోషనే కారనం. జులైనుంచి ఒకవైపు పోస్ట్ ప్రొడక్షన్ మరో వైపు వారణాసి వరల్డ్ టూర్.. ఇలా మార్చ్ లో సినిమా రిలీజ్ అయ్యే వరకే కాదు, మే, జూన్ లోకూడా ఆఫ్టర్ రిలీజ్ సెలబ్రేషన్్ ని కూడా ప్రమోషన్స్ రూపంలో ప్లాన్చేశాడు రాజమౌళి.సో వారణాసిని వరల్డ్ వైడ్ గా 55 వేల థియేటర్స్ లో రిలీజ్ చేయటం నిజంగా జరిగితే, నెక్ట్స్ మూవీ పరిస్థితేంటి? వారణాసి ఏమాత్రం బాగుందనే టాక్ వచ్చినా, వరల్డ్ వైడ్ గా రాజమౌళి పేరు మారుమోగుతుంది.

తర్వాత తను తీసే ఏ సినిమా అయినా పాన్ వరల్డ్ ప్లాట్ ఫాంలో బుల్లెట్ ట్రైన్ లా దూసుకెళుతుంది. ఆలెక్కన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అద్రుష్టవంతుడే.ఎందుకంటే తనని చెక్కిన జక్కన్న చేతిలో పాన్ వరల్డ్ లెవల్లో తను దూసుకెళ్లే అవకాశం పొందుతున్నాడు. వారణాసి తర్వాత రాజమౌళి తీసే ఎన్టీఆర్ సినిమా కూడా 1000 కోట్ల పైనే బడ్జెట్ ఉండే ఛాన్స్ఉంది. 55 వేల థియేటర్స్ ని మించేలా ఈ ప్రాజెక్ట్ రిలీజ్ అయ్యేఅవకాశం ఉంది. ఇలాంటి ప్రయత్నమే మొదలైనా, మొదలౌతుందని తెలిసినా, అవేంజర్స్ లో ఎన్టీఆర్ ని కొత్త సూపర్ హీరోగా తీసుకునే ప్రయత్నం గొప్పదిగానే మారతుంది. నిజం చెప్పాలంటే పాన్ వరల్డ్ లెవల్లో రెండు మైండ్ బ్లాంక్ అయ్యే ప్రాజెక్టులు ఎన్టీఆర్ కి దక్కినట్టౌతుంది.

Published : 
  • 21 February 2026, 3:48 PM IST