టీ20 ప్రపంచ కప్ 2026 నాకౌట్ దశ సమీపిస్తున్నవేళ.. సెమీస్ వేదికల విషయంలో ఐసీసీ కీలక మార్పులు చేసింది. సెమీఫైనల్ వేదికల విషయంలో ఐసీసీ ఓ ఆసక్తికర నిర్ణయాన్ని తీసుకుంది. సాధారణంగా సెమీఫైనల్స్ భారత్‌లోని కోల్‌కతా, ముంబైలలో జరగాల్సి ఉంది. అయితే పౌర భద్రత, రాజకీయ కారణాల దృష్ట్యా పాకిస్థాన్ జట్టు భారత్‌లో ఆడే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో ఐసీసీ కొన్ని పరిస్థితులకు అనుగుణంగా సెమీస్ వేదికలను ప్రకటించింది.ఐసీసీ నిబంధనల ప్రకారం.. ఒకవేళ పాకిస్థాన్ జట్టు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తే.. ఆ మ్యాచ్ మార్చి 4న శ్రీలంకలోని కొలంబోలో జరుగుతుంది.
పాకిస్థాన్ జట్టు భారత్‌లో పర్యటించే అవకాశం లేకపోవడమే దీనికి ప్రధాన కారణం.ఒకవేళ పాకిస్థాన్ అర్హత సాధించకుండా.. శ్రీలంక జట్టు సెమీఫైనల్‌కు చేరితే, వారు కూడా తమ సెమీఫైనల్ మ్యాచ్‌ను కొలంబోలోనే ఆడే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఒక షరతు ఉంది. శ్రీలంక జట్టు సెమీఫైనల్లో భారత్‌తో తలపడకూడదు. ఒకవేళ శ్రీలంక మరే ఇతర జట్టుతో తలపడినా ఆ మ్యాచ్ స్వదేశంలోనే ఆడుకోవచ్చు.భారత జట్టు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తే.. ప్రత్యర్థి ఎవరైనా సరే ఆ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతుంది. కానీ ఇక్కడే ఓ పెద్ద ట్విస్ట్ ఉంది.
ఒకవేళ సెమీఫైనల్లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడాల్సి వస్తే, ఆ హై-వోల్టేజ్ మ్యాచ్ ముంబై నుంచి కొలంబోకు మారుస్తారు.భారత్, పాకిస్థాన్ లేదా శ్రీలంక.. ఈ మూడు జట్లు సెమీఫైనల్‌కు చేరుకోని పక్షంలో షెడ్యూల్ పాత పద్ధతిలోనే సాగుతుంది.ప్రస్తుతం సూపర్-8లో శ్రీలంక, పాకిస్థాన్ జట్లు గ్రూప్-2లో ఉన్నాయి. కాబట్టి ఈ రెండు జట్లు సెమీఫైనల్లో ఒకదానితో ఒకటి తలపడే అవకాశం లేదు. గ్రూప్-1 టాపర్, గ్రూప్-2 రన్నరప్ మధ్య ఒక సెమీస్..వ గ్రూప్-2 టాపర్, గ్రూప్-1 రన్నరప్ మధ్య మరో సెమీస్ జరుగుతుంది. శ్రీలంక అభిమానులకు ఇది శుభవార్త అని చెప్పవచ్చు, ఎందుకంటే వారి జట్టు సెమీస్‌కు చేరితే సొంత గడ్డపై ఆడే అవకాశం లభిస్తుంది.