మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వచ్చే రెండు సంక్రాంతులు తనవే అంటున్నాడు. ఔను ఆల్రెడీ డ్రాగన్ అలియాస్ బ్రూస్లీ పొంగల్ పోరుకే సిద్దపడుతున్నాడు. జస్ట్ ఇమాజిన్ ఎన్టీఆర్ ఒకే ఏడాది రెండు సినిమాలతో దాడి చేస్తే ఎలా ఉంటుంది? అది కూడా పాన్ ఇండియా లెవల్లో కాదు, పాన్ వరల్డ్ లెవల్లో.. అదే జరగబోతోంది... అది కూడా ఒకే జోనర్, ఒకే ఫ్లేవర్, ఆఖరికి ఒకే మూవీ అయితే... ఔను డ్రాగన్ వర్కింగ్ టైటిల్ గా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ సినిమా ఒకే ఏడాది సంక్రాంతి, దసరా పండగల్నే టార్గెట్ చేసుకుంటోంది. కట్ చేస్తే దేవర సీక్వెల్ టార్గెట్ కూడా సంక్రాంతే అని తేలింది. ఇది ఆల్ మోస్ట్ కన్ఫామ్ న్యూసే అని తెలుస్తోంది. అంటే రాబోయే సంక్రాంతే కాదు, ఆతర్వాత వచ్చే సంక్రాంతి కూడా ఎన్టీఆర్ ఖాతాలోనే పడబోతోందా? ప్రతీ 6 నెలలకో సునామీని ఎన్టీఆర్ ప్లాన్ చేస్తున్నాడా?
వాయిస్3: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పండగలనే టార్గెట్ చేస్తున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దండెత్తబోతున్నతను, బ్యాక్ టు బ్యాక్ పండగలను కూడా అదేవిదంగా దయలేకుండా దాడికి రెడీ అవుతున్నాడు.ఇదే జరిగేలా ఉంది. రెండు సంక్రాంతులు, ఒక దసారానే ఇప్పుడు తన టార్గెట్ లో ఉన్నట్టు తెలుస్తోంది.నిజానికి ఈ ఏడాది జూన్ లో డ్రాగన్ అలియాస్ బ్రూస్లీ రిలీజ్ అనుకున్నారు. కాని ఒక భాగం అనుకున్న మూవీ రెండు పార్టులుగా మార్చటంతో, దసరా వరకు షూటింగ్ కొనసాగించాల్సి వస్తోంది. కట్ చేస్తే 2027 సంక్రాంతికే డ్రాగన్ వచ్చేలా ఉంది. ఆల్ మోస్ట్ ఫిల్మ్ టీ జనవరి 10 నే రిలీజ్ చేయాలనే నిర్ణయానికి వచ్చిందంటున్నారు. మేబీ టీజర్ లేదంటే గ్లింప్స్ ని లాంచ్ చేసేప్పుడే రిలీజ్ డేట్ అఫీషియల్ గా రావొచ్చు.
ఇక్కడ డ్రాగన్ రాబోయే సంక్రాంతికి వస్తోందన్నది వార్త కాదు, మినిమమ్ ఆరునెల్ల గ్యాప్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఎన్టీఆర్ ఏకంగా మూడు సినిమాలను వదలబోతున్నాడు.. రాజమౌళి డైరెక్షన్ లో తను కమిటయ్యే ప్రాజెక్ట్ కి ముందు మూడు సినిమాలతో బాక్సాఫీస్ మీద దుమ్ముదులిపే దాడికి రెడీ అవుతున్నాడు.. 2027 సంక్రింతికి డ్రాగన్ మూవీ మొదటి భాగం రాబోతోంది.టైటిల్ బ్రూస్లీగా మారుస్తారా మరో పేరు పెడతారా అన్నది తేలే వరకు వర్కింగ్ టైటిల్ డ్రాగన్ నే అంతా ఫాలో అవుతున్నారు కాబట్టి, 2027 కి వచ్చేది డ్రాగన్ 1 గా భావించాలి.. ఇక వచ్చే ఏడాది దసరాకు కాస్త ముందు రెండో భాగం డ్రాగన్ 2 వస్తుందని తెలుస్తోంది. ఇలా ఒకేసారి రెండు భాగాలు ఒకే ఏడాది మీద దాడి చేయటమే కాదు, 2028 అంటే, ఆతర్వాత సంవత్సరం కూడా ఎన్టీఆర్ ఎటాక్ తోనే మొదలు కాబోతోంది
హిట్ మూవీ దేవరకి సీక్వెల్ గా ప్లాన్ చేస్తున్న దేవర 2 రిలీజ్ డేట్ 2028 సంక్రాంతిగా ప్లాన్ చేస్తున్నారట. 2027 జూన్ లో రాజమౌళి సినిమా మొదలయ్యేలోపే రెండు డ్రాగన్ల దాడి జరుగుతుంది. దేవర మాత్రం రాజమౌళి సినిమా ప్లానింగ్ టైంలో దండెత్తే ఛాన్స్ కనిపిస్తోంది. కాకపోతే రాజమౌళితో ఎన్టీఆర్ మూవీ పట్టాలెక్కేలోపు అటే 2028 సంక్రాంతికి దేవర సీక్వెల్ రావటం కన్ఫామ్ అని తెలుస్తోంది. అదే జరిగితే, ప్రతీ 6 నెలలకో సినిమా చొప్పున, ఎన్టీఆర్ వచ్చే రెండు ఏడాదుల మీద దాడి చేసినట్టే.