తండేల్' లాంటి మాస్ హిట్ తర్వాత అక్కినేని నాగచైతన్య రూట్ మార్చారు. 'విరూపాక్ష'తో టాలీవుడ్‌ను షేక్ చేసిన డైరెక్టర్ కార్తీక్ దండుతో కలిసి ఇప్పుడు ఒక మిస్టిక్ థ్రిల్లర్‌తో మన ముందుకు వస్తున్నారు. అదే 'వృషకర్మ'.. ఈ సినిమా గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. వాటన్నింటికీ ఫుల్ స్టాప్ పెడుతూ మేకర్స్ అదిరిపోయే అఫీషియల్ అప్డేట్ ఇచ్చారు. వృషకర్మ ప్రపంచాన్ని పరిచయం చేస్తూ మేకర్స్ మార్చి 5, 2026న గ్రాండ్ గా ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేయబోతున్నారు. రీసెంట్ గా రిలీజ్ చేసిన పోస్టర్ చూస్తుంటే చైతన్య ఒక చీకటి గుహలో, చేతిలో ఒక పురాతన ఆయుధం పట్టుకొని, ఇంటెన్స్ లుక్‌తో కనిపిస్తున్నారు.
చైతూ బాడీ లాంగ్వేజ్ మరియు రగ్గడ్ లుక్ చూస్తుంటే ఈ సినిమా కోసం ఆయన ఎంతగా కష్టపడ్డారో అర్థమవుతోంది. ఈ మూవీ మిస్టరీ, అడ్వెంచర్ మరియు మిథికల్ ఎలిమెంట్స్‌తో కూడిన కథ అని పోస్టర్ హింట్ ఇస్తోంది. ఈ సినిమాలో నాగచైతన్య సరసన క్రేజీ హీరోయిన్ మీనాక్షి చౌదరి నటిస్తుండగా, 'లాపతా లేడీస్' ఫేమ్ స్పర్శ్ శ్రీవాస్తవ విలన్ రోల్ చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఈ సినిమాకి స్క్రీన్ ప్లే అందిస్తున్నది మరెవరో కాదు.
లెజెండరీ డైరెక్టర్ సుకుమార్. అలాగే 'కాంతార' ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తుండటం సినిమాపై అంచనాలను రెట్టింపు చేస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ భారీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాయి. కార్తీక్ దండు గతంలో 'విరూపాక్ష'తో విజువల్ గా వండర్స్ క్రియేట్ చేశారు. ఇప్పుడు 'వృషకర్మ' కోసం అంతకు మించిన క్వాలిటీతో, గ్రాఫిక్స్ మరియు సెట్టింగ్స్ విషయంలో అస్సలు తగ్గట్లేదు. సమ్మర్ లో విడుదలకానున్న ఈ సినిమా కోసం అక్కినేని అభిమానులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు.