వాటర్ బాటిల్స్ , బ్యాట్లు మోశాం సిరాజ్ ఫన్నీ కామెంట్స్…!

భారత్ టీ20 వరల్డ్‌కప్ హిస్టరీలో మూడోసారి టీ20 వరల్డ్ కప్ గెలిచింది. ఇదివరకు 2007లో ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో, 2024లో రోహిత్ శర్మ నాయకత్వంలో టైటిల్ గెలిచిన టీమిండియా,

Post Published By: dialnews
Updated : 11 March 2026, 5:35 PM IST

భారత్ టీ20 వరల్డ్‌కప్ హిస్టరీలో మూడోసారి టీ20 వరల్డ్ కప్ గెలిచింది. ఇదివరకు 2007లో ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో, 2024లో రోహిత్ శర్మ నాయకత్వంలో టైటిల్ గెలిచిన టీమిండియా, ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో మరోసారి విజేతగా నిలిచింది. డిఫెండింగ్ ఛాంపియన్స్ హోదాలో టీమిండియా టైటిల్‌ను నిలబెట్టుకుని రికార్డు సృష్టించింది.టీమిండియా ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ 2026 టైటిల్‌ను గెలుచుకున్న తర్వాత మొహమ్మద్ సిరాజ్ ఫన్నీ కామెంట్స్ బాగా వైరల్ అయ్యాయి. టీమిండియా ప్లేయర్ల ఎమోషనల్ రియాక్షన్స్ కోసం గ్రౌండ్‌లోకి వచ్చిన బ్రాడ్‌కాస్టర్లకు సిరాజ్ వ్యాఖ్యలు నవ్వు తెప్పిచ్చాయి. సిరాజ్ చెప్పిన సమాధానానికి పక్కనే ఉన్న కుల్దీప్ యాదవ్ కూడా నవ్వేశాడు.

ఫైనల్‌లో విజయానంతరం ప్రెజెంటర్ అడిగిన ప్రశ్నకు సిరాజ్ ఆసక్తికరంగా స్పందించాడు. ఇది దేవుడి స్క్రిప్ట్ లాంటిదన్నాడు. మొదట్లో తాను జట్టులో లేననీ, తర్వాత ఒక్కసారిగా కాల్ వచ్చిందనీ, చివరికి తాము ఛాంపియన్స్ అయ్యామని చెప్పాడు. ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉండకపోవడం కొన్నిసార్లు నిరాశ కలిగించొచ్చనీ, మరి మీ ఇద్దరి పాత్ర ఎలాంటిదంటూ ప్రశ్నించాడు. దానికి సిరాజ్ నవ్వుతూ సమాధానం ఇచ్చాడు. తామిద్దరం చాలా పెద్ద పాత్ర పోషించామనీ, బయట కూర్చొని ఆటగాళ్లకు నీళ్లు ఇచ్చామనీ. బ్యాట్లు మోశామనీ నవ్వుతూ చెప్పాడు. అప్పుడు అతని పక్కనే నిలబడి ఉన్న స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా నవ్వు ఆపుకోలేకపోయాడు.

ఈ టోర్నమెంట్‌లో సిరాజ్ ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడాడు. అది యూఎస్ఏపై జరిగిన మ్యాచ్. ఆ మ్యాచ్‌లో అతను 29 పరుగులకు మూడు వికెట్లు తీసి మంచి ప్రదర్శన కనబర్చాడు. కానీ ఆ తర్వాత మరో మ్యాచ్ ఆడే అవకాశం అతనికి రాలేదు. అదే విధంగా కుల్దీప్ యాదవ్ కూడా ఈ టోర్నమెంట్‌లో ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడాడు. అది పాకిస్తాన్‌పై జరిగిన మ్యాచ్. ఆ మ్యాచ్‌లో అతను ఒక వికెట్ సాధించాడు.ప్రతి ఆటగాడూ తుది జట్టులో ఆడాలని అనుకుంటాడనీ, జట్టు కాంబినేషన్ కోసం బయట కూర్చోవాల్సి వస్తుందన్నాడు. వ్యక్తి కంటే జట్టు ముఖ్యమైందన్న సిరాజ్ . జట్టు ఏం నిర్ణయిస్తే అదే మంచిదని తాము నమ్ముతామన్నాడు.

Published : 
  • 11 March 2026, 5:35 PM IST